Guna Sekhar : టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణమైన మరియు చరిత్రాత్మక పౌరాణిక చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించే డైరెక్టర్లలో ఒకరు గుణశేఖర్. తన సినిమాలలో భారీ సెట్టింగులు వేస్తూ సినిమా ప్రియులను ఎంతగానో కనువిందుచేసే డైరెక్టర్ గుణశేఖర్ చారిత్రాత్మక సినిమా ని స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. “శకుంతలం” అనే టైటిల్ కలిగిన ఈ సినిమాని చేస్తున్నట్లు .. ట్విట్టర్ లో గుణశేఖర్ తెలిపారు. అదేవిధంగా దగ్గుబాటి రానా తో చేస్తున్న “హిరణ్యకశ్యప” మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం అయిపోగా కరోనా కారణంగా సినిమా ఆగిపోవటంతో త్వరలో అది స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపారు.

దీంతో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేయడానికంటే ముందు… భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ… అని ‘శకుంతలం’ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న..ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేవారం నుంచి ప్రారంభం కానుంది. నీలిమ గుణ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమంతతో పాటు ఇండస్ట్రీలో దిగ్గజ నిర్మాతల అల్లు అరవింద్, దిల్ రాజు పాల్గొన్నారు. ప్రధాన పాత్రలో సమంత నటిస్తున్నట్లు ..ఇంకా అదే విధంగా కీలకమైన పాత్రలో అనుష్క కూడా నటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.