Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ భారీగా సెట్లు వేసే డైరెక్టర్ గుణశేఖర్. ఇటీవల ఆయన పుట్టిన రోజు కావడంతో ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు తెలియజేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ “ఒక్కడు” అవ్వటం అదే రీతిలో అల్లు అర్జున్ తో గోనగన్నారెడ్డి వంటి పాత్రలు చేయించడం వంటి విషయాలపై గుణశేఖర్ తన దైన శైలిలో అప్పటి విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం సమంత తో చేస్తున్న “శకుంతల” సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొట్టమొదటిసారి ఈ సినిమా తీయాలనే ఆలోచన వచ్చిన టైంలో అనేక మంది హీరోయిన్లు మదిలో మెదిలారు. కానీ నిర్మాత కి స్టోరీ తెలియటంతో.. “రంగస్థలం” సినిమాలో రామలక్ష్మి పాత్ర అదరగొట్టే రీతిలో సమంతా చేశారు. కరెక్ట్ గా ఈ సినిమాకి ఆమె కరెక్ట్ అని నిర్మాత తెలపడంతో వెంటనే నా ఆలోచనలు పక్కన పెట్టి.. సమంతా ని సెలక్ట్ చేయడం జరిగిందని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.
Read More: Samantha: సమంతతో చిట్ చాట్ చేసిన దేత్తడి హారిక.. బోలెడన్ని సీక్రెట్స్ రివిల్..!!
సమంత కెరీర్ పరంగా చూసుకుంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ.. సినిమా లవర్ అని.. ఓ బేబీ వంటి సినిమాలో తన వయసుకు మించి పాత్ర చేసి అదరగొట్టారు కచ్చితంగా శకుంతల స్టోరీ ఆమెకు సూటవుతుందని తర్వాత నాకు ఆమెను ఎనలైజ్ చేసుకున్నాక మంచి క్లారిటీ స్టోరీ పై పడిందని శేఖర్ తెలిపారు. స్టోరీని ఆమెకు చెప్పిన టైం లో ఆమె లో నాకు సమంత కాకుండా శకుంతల యే.. కనిపించారని ఆమె కూడా స్టొరీ కి బాగా కనెక్ట్ అయింది అంటూ సమంత పై గుణశేఖర్ ప్రశంసల వర్షం కురిపించారు.