NewsOrbit
రివ్యూలు సినిమా

రివ్యూ : గుంజన్ సక్సేన – మొదటి మహిళా యుద్ధ వైమానికురాలిగా శ్రీ దేవి కూతురు

కరోనా కారణంగా ఇటు టాలీవుడ్ తో పాటు ఎన్నో బాలీవుడ్ సినిమాలు ఓటీటీ రిలీజ్ లు చేపడుతున్నాయి. ఇప్పుడు అదే దారిలో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ప్రధాన పాత్రలో నటించినగుంజన్ సక్సేనా : కార్గిల్ గర్ల్సినిమా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. 1 గంటా 52 నిమిషాల నిడివిగల ఈ సినిమాను కరణ్ జోహార్ జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించగా…. పంకజ్ త్రిపాఠి మరో ప్రధాన పాత్రలో మెప్పించాడు. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే…..

 

Gunjan Saxena The Kargil Girl movie review : Janhvi Kapoor playes ...

1999లో ఇండియాపాక్ మధ్య జరిగిన కార్గిల్ వార్ లో వీరోచిత రెస్క్యూ ఆపరేషన్ తో ది కార్గిల్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.

కథ

గుంజన్ సక్సేనా (జాహ్నవి కపూర్) చిన్నప్పటినుండి పైలెట్ అవ్వాలని కలలు కనేది. తన ఆలోచనని సపోర్ట్ చేశాడు ఆమె తండ్రి అనూప్ సక్సేనా(పంకజ్ త్రిపాఠి). పైలెట్ అవ్వడం కోసం అవసరమైన చదువులు చదివిన ఆమె ఆర్థికంగా పైలట్ ట్రైనింగ్ రుసుమును చెల్లించలేక మధ్యలో డ్రాప్ అవుతుంది. అప్పుడే ఇండియన్ ఎయిర్ఫోర్స్ మొదటి సారి మహిళా పైలెట్స్ కోసం ఓపెనింగ్స్ విడుదల చేయగాఎంట్రన్స్ టెస్ట్ లో వంద మంది అమ్మాయిలు పాల్గొనగా గుంజన్ సక్సేనా ఒక్కటే సెలక్ట్ అవుతుంది. ఇక అదే సంకల్పబలంతో కార్గిల్ వార్ వరకు తన జర్నీ ని ఎలా కొనసాగించింది….అంతమంది పురుష ఎయిర్ ఫోర్స్ పైలట్స్ మధ్య ఒక అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేదే కథ

Gunjan Saxena Movie Review: Janhvi Kapoor and Pankaj Tripathi ...

ప్లస్ లు

బలమైన కథ

జాహ్నవికపూర్నటన

మహిళా సాధికారత వివరించే సన్నివేశాలు

మైనస్ కు

కొన్ని సీన్స్ నిడివి

స్క్రీన్ ప్లే

సరైన రన్ టైం లేని ముగింపు

Gunjan Saxena: The Kargil Girl Movie Review: A deeply moving tale ...

విశ్లేషణ :

కథ పరంగా చూసుకుంటే ఈ బయోపిక్ లో డైరెక్టర్ మొదటి మహిళా ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ గా గుంజన్ సక్సేనా చూసిన ఇబ్బందులు గురించి ఎక్కువగా చూపించారు. అయితే అంతలా ఆమె ప్రాబ్లమ్స్ చూపించి అందులో నుండి హీరోయిక్ మూమెంట్స్ రాబట్టిన దర్శకుడు…. చివరికి కథను అర్ధాంతరంగా ముగించడం చాలా పెద్ద మైనస్. కథ పరంగా చాలా సన్నివేశాలలో ప్రేక్షకుడికి విపరీతమైన ఉత్తేజపరిచే ఫీలింగ్స్ కలిగించే అవకాశం ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోలేక కథను సింపుల్ గా తీసుకెళ్లిపోయారు. నరేషన్ బాగా ఇచ్చారు కానీ ఆమె అన్ని ఇబ్బందులు పడి అంతటి ఘనత సాధించిన దానికి…. అటు ఇబ్బందులు ఇటు ఎలివేషన్ రెండిటిని సరిగ్గా మేనేజ్ చేయలేక ఇబ్బంది పడ్డాడు. సినిమా లో ఇది మిస్ కావడం వలన కొంత అసంతృప్తి ఉండిపోతుంది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది. అమిత్ త్రివేది పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయింది. ఆర్ట్ వర్క్, వీఎఫెక్స్ డీసెంట్ గా ఉన్నాయి

Movie Review: Gunjan Saxena. Gunjan Saxena would have been ...
Jahnvi kapoor with GUNJAN SAXENA

ఇంతకీ చూడొచ్చా?

తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఎంతో మందికి స్ఫూర్తి. మహిళల్లో ఇంకా స్ఫూర్తిని రగిలించే కొన్ని సీన్స్ ని బాగా తెరకెక్కించారు. సినిమాపరంగా ఆడియస్ ను ఆద్యంతం కూర్చో పెట్టే విధంగా కథను తెరకెక్కించడంలో దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. టైటిల్, పోస్టర్ చూసి యుద్ధం ఎపిసోడ్స్ భారీగా ఉంటాయి అనుకుంటే మాత్రం నిరాశ పడతారు. అక్కడక్కడ సాగదీత ఫీలింగ్ వచ్చినా మంచి ఫీల్ ఇస్తుంది. బయోపిక్ అంటే ఇష్టపడేవారు కచ్చితంగా చూడాలి. ఇక సినిమాని సినిమా పరంగా చూసేవారికి మాత్రం కొంచెం ఇబ్బందే.

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri