Chiranjeevi: మెగాస్టార్ తో “ఠాగూర్” లాంటి సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్..??

Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో “ఠాగూర్” సినిమా ఏ రేంజ్ లో ఆడిందో అందరికీ తెలుసు. తమిళ సినిమా “రమణ” నీ తెలుగులో “ఠాగూర్” గా రీమేక్ చేశారు డైరెక్టర్ వి.వి.వినాయక్. చిరంజీవి హీరోగా శ్రేయ హీరోయిన్ పాత్రలో.. చేసిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. సమాజంలో అవినీతిని అంతం చేసే రీతిలో చిరంజీవి క్యారెక్టర్ అద్భుత రీతిలో చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో నేను సైతం ప్రపంచానికి అనే సాంగ్ అప్పట్లో మారుమ్రోగింది.

I Have Big Plans With Chiranjeevi: Gunasekhar - Gulte Ganasekhar

ఈ సినిమా తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావాలి అనే నినాదం మరింతగా పెరిగింది. దీంతో తర్వాత చిరంజీవి రాజకీయాల్లో వచ్చే “ప్రజారాజ్యం” పార్టీ పెట్టిన సమయంలో ఆయన చేసే ప్రతి ప్రచారంలో ఠాగూర్ పాటలు వినబడేవి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే తరహాలో చిరంజీవితో సినిమా చేయటానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ డైరెక్టర్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే డైరెక్టర్ గుణశేఖర్ చిరంజీవి కోసం ప్రత్యేకంగా ప్రస్తుతం ఆయన ఏజ్ కి తగ్గ రీతిలో.. ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా రెడీ చేస్తున్నట్లు..పాన్ ఇండియా తరహాలో స్క్రిప్ట్ డిజైన్ అయినట్లు సరికొత్త వార్త ఫిలిం వర్గాలలో వినబడుతోంది.

Read More: Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్..??

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తెలియజేసినట్లు తన ఆల్ టైం ఫేవరేట్ యాక్టర్ చిరంజీవి అని కచ్చితంగా ఆయనతో సినిమా చేయడం జరుగుతుందని తెలపడం జరిగింది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే లూసిఫర్ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. గుణశేఖర్ ప్రస్తుతం సమంతతో శకుంతల సినిమా చేస్తున్నారు.


Share

Related posts

వైసీపీ కీలక నేత బోస్ ఏంటి ఇలా మాట్లాడారు..!?

Special Bureau

లాస్య యూట్యూబ్ చానెల్ బ్యాక్ వచ్చేసింది.. సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్న లాస్య?

Varun G

Justice Kanagaraj: ఎస్ఈసీ పదవి పోతేనేమీ..! జస్టిస్ కనగరాజ్ కు మరో పదవి ఆఫర్ చేస్తున్న జగన్ సర్కార్..! అది ఏమిటంటే..?

somaraju sharma