Guntur Kaaram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “గుంటూరు కారం” జనవరిలో విడుదల కాబోతుంది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ పక్కా మాస్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు మరియు పోస్టర్స్ అదేవిధంగా స్టిల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహేష్ సరసన శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ నవంబర్ నెల చివర ఆఖరికి దాదాపు పూర్తిచేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేయడం జరిగింది.
ఇక డిసెంబర్ నుండి సినిమా ప్రమోషన్స్ షురూ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇదిలా ఉంటే తెలుగు చలనచిత్ర రంగంలో ఇప్పటి వరకు.. ఏ సినిమాకి జరగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈ సినిమాకి త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్..కి ముందుగా అభిమానులు అతిథుల మధ్య నిర్వహించేసి తరువాత ఆ ఈవెంట్.. టెలికాస్ట్ చేయాలని గురూజీ ప్లాన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ గత సినిమా “అలా వైకుంఠపురం లో” ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా వైవిధ్యంగా నిర్వహించారు. మ్యూజిక్ కాన్సెర్ట్ పేరుతో.. మొత్తం ఫ్రీ రిలీజ్ మైదానంలో.. వాయిద్యాలు పెట్టి మ్యూజిక్ దర్శకుడు తమన్ టీంనీ… చాలా హైలెట్ చేయడం జరిగింది.
అయితే ఇప్పుడు “గుంటూరు కారం” సినిమాకి మాత్రం ముందుగా అభిమానులు అతిథుల మధ్య నిర్వహించి దానిని టెలికాస్ట్ చేసి సొమ్ము చేసుకునే విధంగా.. త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా “గుంటూరు కారం” ఫస్ట్ సాంగ్ “దమ్ మసాలా” యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. తమన్ ఇచ్చిన బాణీలు… సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. త్రివిక్రమ్ మహేష్ కలయికలో వస్తున్న ఈ మూడో సినిమా… సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.