Guppedantha Manasu: నేను ఎవరిని పెళ్లి చేసుకోనన్న వసుధారా..!? కన్నీటిపర్యంతమైన రిషి..!!

Share

Guppedantha Manasu: స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియళ్లలో గుప్పెడంత మనసు ఒకటి.. ఈ సీరియల్ టాప్ రేటింగ్ లలో చక్కటి స్థానంలో ఉంది..!! ఇక రిషి – వసుధారా ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..!! ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న 337 సీరియల్ పూర్తి కథనం మీకోసం..!!

నేను ఎవరికీ భారం కాకూడదని వెళ్తున్నాను సార్ అన్నా వసుధారా.. తనతో మనకేం సంబంధం మహీంద్రా అన్న జగతి మాటలను.. ఒకవేళ బస్సు ద్వారా వెళ్తాను అన్నా కూడా మీరు ఆపాలి కదా మేడం అన్న రిషి మాటలను.. దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు మహీంద్రా.. డాడ్ మీరేంటి ఇక్కడ.. ఈ ప్రశ్న నీది కాదు నాది.. ఎందుకంటే నేను వచ్చిన చోటికి నువ్వు ఎందుకు వచ్చావు.. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అని చెబుతాడు రిషి.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా..!? ఒక ప్రశ్నకు కు సమాధానం వెతుక్కుంటూ వచ్చాను రిషి.. ఏం ప్రశ్న డాడ్.. నీకు అర్థం కాదులే రిషి.. ప్రయత్నిస్తాను డాడ్ చెప్పి చూడండి.. అంటూ చిన్న ప్రశ్నలు వేస్తాడు వాటికి తెలుగులో సమాధానం చెప్పమని అడుగుతాడు.. ఒకరు ఒకరి నుండి దూరం చేయాలన్నా ప్రయత్నించారు రిషి ఆ ఒక్కరు ఎవరు తెలిస్తే ఉంటుంది..!! వెంటనే ఋషి వసుంధర గురించా..!? అని అడుగుతారు.. అరే నేను అలా ఏదో చెప్తే నీకు వసుధారా గుర్తొచ్చిందా ఏంటి అని మహీంద్రా అంటాడు..!!

రిషి మొన్న టైం కి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది.. అలా ఏం జరగలేదు కదా డాడ్.. ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి.. లేదు నేను ఆలోచిస్తాను.. ఆ మూడో మనిషి ఎవరో తెలుసుకుని తెలుసుకుంటాను.. సరే ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి.. పదండి ఇంటికి వెళ్దాం అంటాడు రిషి.. కట్ చేస్తే.. గౌతమ్ వసుధారా ఇంటికి వస్తాడు.. జగతి మేడం తలుపు తీయగా కొంచెం సైడ్ ఇస్తే లోపలికి వస్తాను అంటాడు.. జగతి ఇండైరెక్ట్ గా కాలేజీ కి టైం అయింది అని వార్నింగ్ ఇస్తుంది.. అంతలోకి వసుధారా వస్తుంది.. మిషన్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి. అవి హార్డ్ కాపీ తీసుకు వచ్చాను అంటాడు. జగతి మేడం ఇన్ డైరెక్ట్ గా మెయిల్ కూడా చేయొచ్చు అని సెటైర్ వేస్తుంది. జగతి మేడం అంతలోకి లోపలికి వెళ్లగా పేపర్స్ చూస్తున్న వసుధారా ను తనకు తెలియకుండా తన ఫోన్లో ఫోటో తీసుకుంటాడు.. కట్ చేస్తే..!!

రిషి వాళ్ళ ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు.. గౌతమ్ ఎక్కడ అని రిషి అడగగా వాళ్ళ వదిన బయటకు వెళ్ళాడు అని అంటాడు.. ఇంత పొద్దున్నే గౌతమ్ కి బయటికి వెళ్ళే పని ఏముంది అని అంటాడు.. వసుధారా ఇంటికి వెళ్ళాడు అని చెబుతోంది వాళ్ళ వదిన..!! అంతే రిషి టిఫిన్ చేయడం పక్కకు పెట్టి కోపంగా వసుధార కి ఫోన్ చేస్తాడు వసుధారా ఎక్కడున్నావ్..!? ఏం చేస్తున్నావ్..!? ఎవరితో ఉన్నావ్..!? గౌతమ్ వచ్చడంటగా.. ఎందుకు వచ్చాడు అని అడుగుతాడు.. వెళ్ళిపోయాడు సార్ అని చెప్తుంది. ఎక్కడున్నావ్ అని అడగగా కాలేజ్ కి వస్తున్నాను అని చెబుతోంది వసుధారా.. సరే కాలేజ్ కి రా మాట్లాడుకుందాం అంటాడు..

Guppedantha Manasu: Today 337 Episode

రిషి కాలేజీలో జగతి మేడమ్ తో వసుంధర గురించి నాకంటే బాగా మీకే తెలుసు. నేను ఏదో చెప్పానని తనతో అలా ప్రవర్తించే ఉండకూడదు అని హితబోధ చేస్తాడు. జగతి మేడం లోపల ముసి ముసి నవ్వులు నవ్వు కుంటుంది. కాలేజ్ కి వచ్చిన రిషి క్లాస్ చెప్పడానికి క్లాస్ రూమ్ లోకి వెళ్తుండగా తన కార్ కి పడిపోవడం వసుధారా చూస్తుంది.. కీ వెతుకుదామని తన ఫ్రెండ్ పుష్ప ని పిలుస్తుంది. తన ఫ్రెండ్ పుష్ప సార్ లోపలికి వెళ్లారు పదా అంటూ లోపలికి తీసుకెళుతుంది..!! కట్ చేస్తే..!!

వసుధార పనిచేసే రెస్టారెంట్ కి రిషి వస్తాడు.. సర్ ఏం కావాలి కాఫీ కావాలా..!? అని అడుగుతుంది వసు.. నేను కాఫీ కోసమే రెస్టారెంట్ కి వస్తానా..!? అని వసుధారా ని రిషి అడుగుతాడు.. అంతలో అదే రెస్టారెంట్ లోకి వచ్చిన గౌతమ్ వసుధార అంటూ గట్టిగా పిలుస్తాడు.. అది చూసిన గౌతమ్ వైపు కోపంగా చూస్తాడు రిషి.. గౌతమ్ తన మనసు లో నేను ఎక్కడికి వెళ్ళినా రిషి నాకు విలన్ లా తయారవుతున్నాడు అనుకుంటాడు .. నువ్వేంట్రా పద్దాక రెస్టారెంట్ లో ఉంటావు.. ఏం పని నీకు ఎక్కడ అని అంటాడు రిషి.. నేను వచ్చిన ప్రతిసారి నువ్వు కూడా ఇక్కడే కనిపిస్తున్నావు నీకేం పని అని గౌతమ్ అడుగుతాడు.. ఎందుకు వస్తున్నావో తెలుసుకోవచ్చా అంటూ రిషిని గౌతమ్ ప్రశ్నిస్తాడు..!? అంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది..!!


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

1 hour ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

6 hours ago