Guppedentha manasu Jan 10 today episode:ప్రేమ లేఖతో అడ్డంగా బుక్ అయిన ఈగో మాస్టర్…ఎలా కవర్ చేస్తాడో చూడాలి మరి..!

Share

Guppedentha manasu Jan 10 today episode: ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో గుప్పెడంత మనసు సీరియల్. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుగా సాగుతూ ఉంది. గత ఎపిసోడ్‌లో రిషి మహేంద్రతో చాలా ఎమోషనల్‌గా మాట్లాడడతాడు.. మరోవైపు జగతి కూడా రిషిని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో రిషి కాలేజ్‌కి వచ్చి కారు దిగగానే ‘సార్ స్టెప్స్ మీద ఉన్నాను’ అని వసు వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. అది విన్న రిషి ఏంటి ఈ వసుధారా నాకు ఆర్డర్ వేస్తుందా.. అయినా తను పిలిస్తే నేను వెళ్లాలా.? నేనేం వెళ్లను?’ అనుకుంటాడు రిషి. ఇంతలో వసు ‘సార్ చూసి కూడా రిప్లై ఇవ్వడంలేదేంటీ? ఆర్డర్‌ వేస్తున్నానని ఫీల్ అయ్యి రారేమో అనుకునేలోపే రిషి వస్తాడు.

Guppedentha manasu Jan 10 today episode: వసు ఇచ్చిన చాక్లెట్ రిషి తిని ఏమి చేస్తాడో తెలుసా.?

రోషికి గుడ్ మార్నింగ్ చెప్పి ఈరోజు వాతావరణం బాగుంది కదా సార్ అని అంటే… రోజు బానే ఉంటుంది కదా అంటాడు రిషి.’సార్ నా దగ్గర చాక్లెట్స్ ఇన్నాయి. మీరు తింటేనే నేను తినగలను’ అంటూ మాట కలుపుతుంది వసు. సరే అని చాక్లెట్ తీసుకున్న మిస్టర్ ఇగో.. ‘నీకు ఉందా నాకు ఇచ్చి ఊరుకుంటున్నావా.. నీ దగ్గర ఉన్నది చూపించు’ అంటాడు. వసు ఏదో తాతాపటాయిస్తూ ఉండడం చూసి తను సగం చాక్లెట్ తిని మిగతా సగం వసుకి ఇచ్చి తినమంటాడు..రిషి వెళ్లగానే.. ‘అయ్యో.. సార్ ను చూసే సరికి నేనేం చేస్తున్నానో.. ఏం మాట్లడుతున్నానో నాకే అర్ధం కావట్లేదు..’ అని తనని తాను తిట్టుకుంటుంది.

ప్రేమలేక రాసే పనిలో బిజీ అయిన ఈగో మాస్టర్!ఎవరికంటే..?

ఇంకా రిషి మెషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ షార్ట్ ఫిలిమ్ గురించి మీటింగ్‌లోకి వెళ్లి..‘చాక్లెట్ షార్ట్ ఫిలిమ్ చేస్తున్నాం కదా’ అంటాడు. ఆ మాట విని మీటింగ్ లో వాళ్లంతా షాక్ అయి చూస్తుంటే వెంటనే రిషి మాట మార్చేస్తాడు.ఇంకా గౌతమ్ రిషి కేబిన్ లో కూర్చుని మనసులో వసుధారాను ప్రేమిస్తున్న అని అనుకుంటూ ఉండగా రిషి వస్తాడు.‘రేయ్ రిషి.. నాకో లవ్ లెటర్ రాసిపెట్టాలిరా’ అంటూ రిషిని కాకపడతాడు.ఎందుకురా అని రిషి అనగానే అదేరా అమెరికా గ్రూప్ ఒకటి ఉంది. అందులో.. ప్రేమ లేఖల పోటీ పెట్టారు. అందుకే నువ్వే రాయాలిరా ప్లీజ్’ అంటూ చాలా రిక్వస్ట్ చేస్తాడు. దాంతో రిషి ఓకే అంటాడు.

వసు బొమ్మని గౌతమ్ వేయడం ఏంటి అని ఆశ్చర్యపోయిన ధరణి :

ఇక సీన్ కట్ చేస్తే ధరణి ఇంట్లో వసుధర బొమ్మ చూసి.. రిషినే గీశాడని తెలియక ‘ఇదేంటి గౌతమ్ వసుధర బొమ్మగీశాడు.వసుధర రిషి మనసులో ఉందికదా అని చాలా కంగారు పడుతుంది. వెంటనే మరోడ్రాయింగ్ షీట్ తీసుకుని వసు బొమ్మ కనిపించకుండా దానిపై కవర్ చేస్తుంది.సరిగ్గా అప్పుడే దేవయాని వస్తుంది కానీ వసు బొమ్మని మాత్రం చూడదు.ఇది ఇలా ఉండగా రిషి లేఖ రాయడం మొదలుపెడతాడు.కళ్లు మూసుకుని వసుని గుర్తుచేసుకోనీ లేఖ రాస్తాడు.ఈలోపు రిషి చేతిలోని లేఖను గౌతమ్ లాక్కుంటాడు. వసునూ చూసి ఆ లవ్ లెటర్ తీసుకుని వసుధారా ఐ యామ్ కమింగ్ అంటూ వసుధారా దగ్గరకు వెళ్తాడు గౌతమ్.అక్కడితో ఈ ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.. రేపటి ఎపిసోడ్ లో రిషి రాసిన లవ్ లెటర్ జగతి మేడం కంట పడుతుంది…మరి కధ ఎలాంటి మలుపు తిరుగుతుందో రేపు చూద్దాం.!!


Share

Related posts

ఆస్తి – ఆశ- అనర్ధం..! ముసలి భార్య- కుర్ర మొగుడి “క్రైమ్ ప్రేమ కథ” చదవండి..!!

Yandamuri

కేసీఆర్‌కు…ఆ టీఆర్ఎస్‌ నేత‌కు తేడా వ‌చ్చింది ఇక్క‌డేనా?

sridhar

కొంప ముంచిన బర్త్ డే పార్టీ 25 మందికి కరోనా

venkat mahesh