ముద్దుగా బొద్దుగా ఉండే హన్సిక అందాలకు ఫిదా కానివారెవరు? దేశముదురు నుంచి మొదలు పెట్టి తాజగా విడుదలైన తెనాలి రామకృష్ణ వరకు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను ఆమె సొంతం చేసుకుంది. మధ్య మధ్యలో ఒడిదుడుకులు ఎదురవుతున్నా.. తన ప్రయాణాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ‘మహా’ అనే సినిమాలో నటిస్తోంది. హారోయిన్ ఓరియంటెడ్ అయిన ఈ చిత్రంలో.. హన్సిక ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ హర్రర్ ఫిల్మ్‌కు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ హాట్ హాట్‌గా ఉంది. కోలీవుడ్ స్టార్ శింబుతో కలిసి హన్సిక రొమాన్స్ చేస్తున్న స్టిల్ అది. గతంలో ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి కూడా అనుకున్నారంతా.. అలాంటి వీరు ఒక్కసారిగా దూరమయ్యారు. అలా విడిపోయిన వీరు చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో ఇలా కలిశారు. ఇద్దరూ మాంచి రొమాంటిక్ మూడ్‌లో ఉండటంతో.. ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎక్స్‌తో హన్సిక అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
జమీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ ఎంటర్టైనర్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రంకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. బ్లడ్తో నిండిన బాత్ టబ్బులో హన్సిక ఉన్న ఫొటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేశాయి. తాజాగా ఈ పిక్ మరింత వైరల్ అవుతోంది. హన్సిక కోసం శింబు అతిథి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.