Hansika: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా హన్సిక సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలో హన్సిక వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. తమిళ ప్రేక్షకులు హన్సికకి కొన్ని చోట్ల దేవాలయాలు కూడా కట్టడం జరిగింది. తమిళ ప్రేక్షకులు చాలా బొద్దుగా ఉండే హీరోయిన్లను ఇష్టపడుతుంటారు. ఈ దిశగానే ఖుష్బూ.. ఇంకా బొద్దుగా ఉండే హీరోయిన్ లకి.. అభిమానం చాటుతూ గూడులు కట్టారు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews

ఇదంతా పక్కన పెడితే హన్సిక కెరీర్ మొత్తానికి ఎక్కువగా సౌత్ లోనే సినిమాలు చేసింది. పుట్టింది మహారాష్ట్ర ముంబై లో అయినా గాని చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో.. కెరీర్ స్టార్ట్ చేసిన హన్సిక… హీరోయిన్ క్రేజ్ వచ్చాక అసలు హిందీలో సినిమాలు చేయలేదు. దీనికి కారణం ఏంటి అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించడం జరిగింది. దానికి హన్సిక సమాధానమిస్తూ… కెరియర్ పరంగా సౌత్ లోనే నాకు ఆదరణ బాగా కలిగింది. అన్ని రకాల పాత్రలు చేయడం నాకిష్టం… అవన్నీ కూడా సౌత్ లోనే అవకాశాలుగా దొరికాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కెరియర్ పరంగా చేసిన పాత్రలకు బాగా సౌత్ ఇండస్ట్రీలోనే సంతృప్తినిచ్చిందని.. హిందీలో ఇలాంటి అవకాశాలు రాలేదని తనదైన శైలిలో హన్సిక తెలిపింది. హీరోయిన్ గా 2007వ సంవత్సరంలో.. హన్సిక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా విజయంతో తెలుగులో అప్పట్లో వరుసపెట్టి ఆఫర్లు అందుకోవడం జరిగింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో వరుస పెట్టి ఆఫర్లు అందుకుంటూ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో… దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా సత్తా చాటుతోంది.