మారాల్సింది ప్రేక్షకులు కాదేమో హనూ…

Share

మారాల్సింది ప్రేక్షకులు కాదేమో హనూ…

ఒక సినిమా బయటికి రావాలంటే 24 క్రాఫ్ట్స్ లోని వందల మంది పని చేయాలి, కోట్లు ఖర్చు పెట్టాలి నెలల తరబడి కష్టపడాలి. ఎంత మనసు పెట్టి పని చేసినా కూడా కొన్ని సార్లు విజయలక్ష్మి వరించదు. ఎంత కష్టపడి చేసినా చూసే వాళ్లకి నచ్చకపోతే ఫ్లాప్ తప్పదు. ఇలాంటి సమయంలో సదరు సినిమాని తెరకెక్కించిన దర్శకుడు డిజప్పాయింట్ అవ్వకుండా బాక్సాఫీస్ పై సందించడానికి తన తర్వాతి అస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా కథని సిద్ధం చేస్తే, అంత పెద్ద విజయం దక్కుతుంది. అయితే కొంతమంది మాత్రం ఫ్లాప్ రాగానే తీసిన సినిమాలో ఉన్న లోపాలు మర్చిపోయే … సినిమా చూసే ప్రేక్షకుడిని, రివ్యూ రాసే క్రిటిక్ ని ఏవేవో అంటుంటారు.
మొదటి సినిమాతోనే క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హనూ రాఘవపూడి కూడా ఇదే చేశాడు. రీసెంట్ గా పడి పడి లేచే మనసు సినిమాని తెరకెక్కించిన హనూ, అది మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో నిరాశపడినట్లు ఉన్నాడు. ప్రేక్షకుడికి అటెన్షన్ డిజార్డర్ ఎక్కువ అయిపొయింది, అందుకే సినిమాని చూసి ఎంజాయ్ చేయకుండా ఎక్కువగా విశ్లేషించడం మొదలు పెట్టాడని ఆడియన్స్ ని విమర్శించాడు. నిజానికి పడి పడి లేచే మనసు మరీ తీసేసే సినిమా కాకపోయినా కూడా ఇటీవలే కాలంలో కొత్త కథలని చూస్తున్న ప్రేక్షకుడిని మెప్పించే అంత గొప్ప సినిమా అయితే కాదు. స్వయంగా హీరోనే సినిమా అందరిని మెప్పించలేకపోయింది అంటేనే సినిమాలో ఎంత విషయం ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి రొటీన్ కథని ప్రేక్షకులకి చూపించిన హనూ, తిరిగి వారినే కామెంట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని కొందరి అభిప్రాయం. ఇప్పటికేదో జరిగిపోయింది సినిమా మీద ప్రేమతో హనూ అలా మాట్లాడి ఉండొచ్చు, ఈసారి అయినా మంచి కంటెంట్ ఉన్న సినిమా చేస్తే, ఇప్పుడు తిడుతున్న అదే ప్రేక్షకుడే, మళ్లీ మళ్లీ వెళ్లి సినిమా చూస్తాడు కాబట్టి హనూ పడి పడి లేచే సినిమా నుంచి బయటకి వచ్చి మంచి కథని సిద్ధం చేసుకోని బౌన్స్ బ్యాక్ అవ్వాలి.


Share

Related posts

డివోషనల్ థ్రిల్లర్ గా ‘దిక్సూచి’

Siva Prasad

బిగ్ బాస్ 4 : షో ప్లాప్ అవ్వడానికి ఈ ఒక్క కారణం చాలు .. నాగార్జున కూడా కాపాడలేడు ??

sekhar

BB-4 లోని ‘ఆ క్రేజీ 4’ తో స్పెసల్ చిట్ చాట్ ప్లాన్ చేస్తున్న యాంకర్ రవి!!

Naina

Leave a Comment