హ్యాపి బర్త్ డే మై ఫూల్: మలైకాకు అర్జున్ బర్త్ డే విషెస్

బాలీవుడ్ ఎప్పుడూ ఎదో ఒక వివాదంతో తెరపై మెదులుతూనే ఉంటుంది. బాలీవుడ్ సినీ పరిశ్రమలో హాట్ టాపిగ్ గా నిలుస్తున్న జంట అర్జున్ కపూర్, మలైకా అరోరా. తనకంటే 11 ఏండ్లు చిన్న వాడైన కుర్ర హీరో అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో పడ్డారన్న వార్తలు వచ్చినవే. ఈ ఇద్దరిపై ప్రేమ వ్యవహారం పై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ కూడా వస్తుంటాయి.

హాట్ ఫోటోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మలైకా అరోరా త్వరలో మళ్లీ పెళ్లి పీటలెక్కనున్నట్టు తెలుస్తున్నది. తన అందంతో కుర్రకారును కట్టి పడేసే ఈ అమ్మడు అర్జున్ కపూర్ తో కొంత కాలంగా డేటింగ్ చేస్తుందన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇద్దరి పిల్లల తల్లితో అర్జున్ కపూర్ డేటింగ్ చేయడమేంటని, వారు ప్రేమలో పడటమేంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్ఫజ్ ఖాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బామ అతనితో విడాకులు కూడా తీసుకుంది. ప్రస్తుతం అర్జున్ ఖపూర్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. త్వరలో వీరి బంధం పెళ్లి బంధంతో మరింత బలపడనున్నట్టు సమాచారం.

శుక్రవారం 48 వ పుట్టిన రోజును జరుపుకుంటున్న మలైకాకు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే మై ఫూల్ మలైకా అరోరా అని కామెంట్ చేశాడు. వీరి టాపిక్ ఏ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది. మలైకా కంటే ముందే అర్జున్ బర్త్ డే సందర్భంగా మలైకా అర్జున్ ఖపూర్ కు ఒక ఫోటో ద్వారా విష్ చేసింది. హ్యాపి బర్త్ డే సన్ షైన్ అంటూ ఆమె చెప్పిన విధానం అప్పట్లో బాలీవుడ్ మీడియాలో సంచలనం రేపింది.