18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RGV: న్యూ ఇయర్ శుభాకాంక్షలు చాలా వెరైటీగా చెప్పిన డైరెక్టర్ ఆర్జీవి..!!

Share

RGV: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక రీతిలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది ప్రముఖులు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నరు. చాలామంది ఈ సంవత్సరం శుభాలు కలగాలని కోరుతూ విషెస్ చెబుతున్నారు. అయితే డైరెక్టర్ ఆర్జీవి మాత్రం చాలా వెరైటీగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. “పాత సంవత్సరంలో ఉన్న సమస్యలన్నీ. కొత్త సంవత్సరంలో కొనసాగుతాయని, మరికొన్ని కొత్తవి వచ్చి చేరుతాయని చెప్పుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు బిలియన్ ల జనాభాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలియజేయడం జరిగింది. ఎవరు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పేవారు లేరనీ పేర్కొన్నారు.

Happy New Year director RGV who said a lot of variety
Ram Gopal Varma

“కొత్త ఏడాదిలో కరోనా వైరస్ కీ డేంజరస్ వ్యాక్సిన్ ల నుండి ఇమ్యూనిటీ రావాలని కోరుకుంటున్నా.. అని ఆర్జీవి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2022లో న్యూ ఇయర్ సమయంలో పలు మీడియా ఛానల్స్ తో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ సరికొత్తగా శుభాకాంక్షలు తెలియజేశారు. నేను సాధారణంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఎవరికీ చెప్పను పైగా నేను నమ్మను. కానీ అందరూ ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అప్పట్లో తెలియజేశారు.

Happy New Year director RGV who said a lot of variety
RGV New Year Wishes

అయితే 2023లో ఈ రీతిగా వివిధ వర్గాలకు చాలా వెరైటీగా ఆర్జీవి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫార్మా కంపెనీలకు న్యూ ఇయర్ సందర్భంగా కొత్త రోగాలు పుట్టుకు రావాలి. పోలీసులకు నేరాలన్నీ ఆగిపోతే పని ఉండదు. నేరగాళ్లకు.. నేరాలు చేసి పట్టుపడవద్దని కోరుకుంటున్నా. సక్సెస్ లేని నటులంతా.. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అంటే పెద్ద నటీనటులు అవ్వాలని కోరుకుంటున్నట్లు.. ఆర్జీవి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


Share

Related posts

రవితేజ నుంచి అంత ఆశించవచ్చా ..?

GRK

అక్కినేని బ్రదర్స్ ఇద్దరు డిసప్పాయింట్‌మెంట్ లో ఉన్నారా ..?

GRK

ర‌కుల్ త‌మ్ముడు ట్రోలింగ్

Siva Prasad