NewsOrbit
Entertainment News సినిమా

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి కొత్త అప్ డేట్ తో ఒక్కసారి హైప్ క్రియేట్ చేసిన హరీష్ శంకర్..!!

Share

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. ఈ మూడింటిలో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ హరీష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 2012వ సంవత్సరంలో “గబ్బర్ సింగ్” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ ని చాలా పవర్ ఫుల్..గా అభిమానులు ఎలా చూడాలనుకున్నారో ఆ తరహాలో.. హరీష్ గబ్బర్ సింగ్ లో చూపించడం జరిగింది. దీంతో వీరి కాంబినేషన్ లో వస్తున్నా ఇప్పుడు రెండో సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Harish Shankar created hype once again with a new update regarding Ustaad Bhagat Singh

ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్ మరియు వీడియోలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా సెప్టెంబర్ 30వ తారీకు “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి డైరెక్టర్ హరిష్ శంకర్.. కొత్త అప్ డేట్ ఇవ్వటం జరిగింది. సినిమాకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన.. కీలకమైన షూటింగ్ కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ ప్రదేశాన్ని.. చూడండి అంటూ తన ట్విట్టర్ ఎకౌంట్ లో డైరెక్టర్ హరీష్ రాసుకురావడం జరిగింది.

Harish Shankar created hype once again with a new update regarding Ustaad Bhagat Singh

హరీష్ పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు “ఉస్తాద్ భగత్ సింగ్” విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు రాజకీయంగా జనసేన పార్టీకి మంచి మైలేజ్ తీసుకొస్తాయని సమాచారం. నవంబర్ నెల చివరి నుండి ఈ సినిమాకి సంబంధించి పాటలు విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

 


Share

Related posts

ఉదయ్ కిరణ్ చేయాల్సిన సినిమా మహేష్ బాబు చేసాడు అదేంటో తెలుసా..??

sekhar

ఎవ‌రా ఇద్ద‌రు బాల‌య్యా?

Siva Prasad

Mahesh-Trivikram: మ‌హేష్‌-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీపై న‌యా అప్డేట్‌.. ఇక త‌గ్గేదే లే!?

kavya N