Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా వరుస పెట్టి సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం జరిగింది. జూన్ 14 నుండి రాజకీయంగా ఫుల్ బిజీ కాబోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో పవన్ షూటింగ్స్ విషయంలో మళ్లీ గ్యాప్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు నిరుత్సాహం చెందుతూ ఉన్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంకి రావటం జరిగింది. డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు నిర్మాతలు ఏఎం రత్నం, డివివి దానయ్య మరి కొంతమంది నిర్మాతలు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు హాజరయ్యారు.
పవన్ మంగళగిరిలో చండీయాగం నిర్వహిస్తూ ఉన్న క్రమంలో… వీళ్లంతా దైవ దర్శనానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇక్కడికి వస్తున్న సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాలలో లొకేషన్స్ చూడటం జరిగింది. ఆల్మోస్ట్ పవన్ సినిమాకి కావలసిన పరిస్థితుల్లో లొకేషన్ అనీ అందుబాటులో ఉన్నట్టు అనిపించాయి. సో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడే సినిమా షూటింగ్స్ జరిగేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్స్ కి ఎక్కడ అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగు సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాలలో సినిమా షూటింగ్ జరుపుకోవడం మంచిదని భావించి రాబోయే రోజుల్లో విజయవాడ పరిసర ప్రాంతాలలో కూడా సినిమా షూటింగ్స్ జరిగేలా చర్యలు తీసుకోబోతున్నట్లు డైరెక్టర్ హరీష్ శంకర్ స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ గారు ఇకనుండి ప్రజల్లో ఉండబోతున్నారు కాబట్టి… ఆయన రాజకీయ జీవితానికి అడ్డు లేకుండా ఆయన ఎక్కడుంటే అక్కడ సినిమా షూటింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయబోతున్నట్లు మిగతా నిర్మాతలు కూడా స్పష్టం చేయడం జరిగింది. హరిష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా పవన్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మాణ సారధ్యంలో “ఓజీ” చేస్తున్నారు. ఈ రెండు సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.