మెగా ఫ్యామిలీలో అంబురాన్నంటే సంబురాలు మొదలయ్యాయండోయ్… ఒక మనసుతో తెలుగు ప్రజలను తన నటనతో కట్టిపడేసిన నిహారిక పెళ్లి పనులు ప్రారంభమయ్యాయోచ్.. డిసెంబర్ లో తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించునున్నట్టు మెగాబ్రదర్ నాగబాబు గారు చెప్పుకొచ్చారు. దీనితో నిహారిక పెళ్లి పనులు షురూ అయ్యాయని దానితో తన కొడుకు వరుణ్ పెళ్లి పనులతో బిజీ బిజీగా ఉన్నట్టు నాగబాబు తెలిపారు.
ఓ ఇంగ్లీషు మీడియాతో నాగబాబు తన కూతురు పెళ్లి విషయాన్ని వెళ్లడించారు. నిహారిక పెళ్లి సంబురాలతో తమ కుటుంబంలో ఆనందాలు నిండాయని ఆయన ఆనందాన్ని వెలిబుచ్చారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్టు ఆయన పేర్కన్నారు. ఇటీవలే నిహారిక కూడా తన పెళ్లి వార్తను కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.
కాబోయే వరుడితో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసి అందరికీ సరైప్రైజ్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో వీరి ఫోటో తెగ వైరల్ అవుతోంది. దీనితో నెటీజన్లు చూడముచ్చటైన జంట అంటూ తెగ పొగిడేస్తున్నారు. గుంటూరు రేంజ్ ఐటీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లి చేసుకోనుంది. చైతన్య హైదరాబాద్ లోని ఓ ఎంఎన్ సీ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు.
వీరి పెళ్లిని అంగరంగ వైభవంగా చేసేందుకు మెగా ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లోనే డెస్టినేషన్ తరహాలో గ్రాండ్ గా పెళ్లికి వరుణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందులో రెండు, మూడు ప్లేస్ లను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇంకేముందు మరికొన్ని రోజుల్లో నిహారిక పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. నిహారికా పెళ్లి ముచ్చటతో అభిమానులందరూ తన వెడ్డింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!