హాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ‘వండర్ ఉమెన్’ సినిమా గుర్తుకు ఉండే ఉంటుంది. డీసీ కామిక్స్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాలో గాల్ గాడట్ వండర్ ఉమెన్‌గా కనిపించారు. ఇప్పటివరకు మూడు సీక్వెల్ మూవీస్ వచ్చినప్పటికి ఈ సినిమాకు ప్రజాధరణ తగ్గలేదు. హాలీవుడ్ అంటేనే యాక్షన్, స్పై, క్రైమ్స్, థ్రిల్లర్, కామిక్, సైన్స్ వంటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఇలాంటి కోణంలో రూపొందించిన మరో స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’. టామ్ హార్పర్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పరిచయం కావడం విశేషం. అయితే ఈ సినిమా ఎలా ఉంది. సినిమా స్టోరీ ఏంటి? గాల్ గాడట్ హిట్ కొట్టిందా? తదితర విషయాల గురించి తెలుసుకుందాం..

సినిమా పేరు: హార్ట్ ఆఫ్ స్టోన్
నటీనటులు: గాల్ గాడట్, ఆలియా భట్, జెమ్మీ డోర్‌నాన్, సోఫీ ఒకేనాడో, మ్యాథ్యీస్ స్చావిగోఫీ తదితరులు
డైరెక్టర్: టామ్ హార్పర్
ప్రొడ్యూసర్: డేవిడ్ ఎల్లీసన్
మ్యూజిక్: స్టీవెన్ ప్రైజ్
రిలీజ్ డేట్: 11 ఆగస్టు 2023

సినిమా స్టోరీ..
రేచల్ స్టోన్ (గాల్ గాడట్) ఇంటర్నేషనల్ సీక్రెట్ ఏజెన్సీ అయిన ‘ది చార్టర్’లో ఏజెంట్‌గా పని చేస్తుంటారు. స్టోన్ ఏ ఆపరేషన్‌లో పాల్గొన్న అది విజయవంతం అవుతుంది. కానీ ఇటలీలో జరిగే ఆపరేషన్‌లో ఫెయిల్ అవుతుంది. చేతికి చిక్కిన శత్రువు పారిపోవడమే కాకుండా.. సేకరించిన రహస్యాలు చేజారిపోతాయి. అందుకు కారణం కేయా ధావన్ (ఆలియా భట్). దాంతో స్టోన్ ఫోకస్ మొత్తం కేయా ధావన్‌పై పడుతుంది. కేయా ఎవరు? ఆమె ఏ ఏజెన్సీ కోసం పని చేస్తుంది? ఆమె టార్గెట్ ఏంటి? ఆ దిశగా రేచల్ స్టోన్ విచారణ మొదలు పెడుతుంది.
ది చార్టర్ ఏజెన్సీ వారు ఉపయోగించే ‘హార్ట్’ అనే డివైన్‌ను చేజిక్కించుకోవడమే కేయా ధావన్ లక్ష్యమని రేచల్ స్టోన్ తెలుసుకుంటుంది. అది స్టోన్‌కు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రతీకారంతో రగిలిపోతున్న కేయా అవకాశం కోసం ఎదురు చూస్తుందని అర్థం చేసుకుంటుంది. అందుకోసమే కేయా చార్టర్ ఏజెన్సీకి శత్రువులైన వారితో చేతులు కలుపుతుంది. ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానంను ఎక్కడి నుంచైనా హ్యాక్ చేసే సామర్థ్యం ‘హార్ట్’కు ఉంటుంది. దాన్ని చేజిక్కించుకోవడానికి కేయా వెనుక పని చేస్తున్న ముఠా తెగ ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆమె ద్వారా హార్ట్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
మరోవైపు కేయా ధావన్ గురించిన పూర్తి వివరాలు స్టోన్‌కు తెలిసిపోతాయి. ఆ తర్వాత స్టోన్ ఏం చేస్తుంది? చార్టర్ ఏజెన్సీ వల్ల కేయా ధావన్‌కు జరిగిన నష్టం ఏమిటి? స్టోన్, కేయా ధావన్ ఎలా కలుసుకుంటారు? వారిద్దరి మధ్య ఎలాంటి పోరాటం జరుగుతుంది? హార్ట్‌ను చేజిక్కించుకునేందుకు మాఫియా ముఠా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? వంటి ఆసక్తికరమైన సందేహాలతో కథ ముందుకు సాగుతుంది.

సినిమా ఎలా ఉంది?
హాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి సినిమాలో విజువల్ ట్రీట్ బాగుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగులు, ఊహించని పోరాట విన్యాసాలు, సాహసాలు మామూలే. స్టోరీ, సినిమా కథ భిన్నమైనది కాదు. స్క్రీన్ ప్లే పరంగా కూడా నార్మల్ అని చెప్పవచ్చు. గాల్ గాడట్, ఆలియా భట్ నటన బాగుంటుంది. ఒకానొక సమయంలో కొంచెం నిరాశపర్చినట్లు అనిపిస్తుంది. ఆలియా ఎంట్రీ ఇచ్చిన విధానం ఆ పాత్ర నుంచి ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆలియా-గాల్ మధ్య పొరాట సన్నివేశాలు పెద్దగా ఉండదు. యాక్షన్ సీన్స్, మంచు కొండల్లో ఛేజింగ్స్ ఆకట్టుకుంటాయి. ఫొటోగ్రఫీ బాగుంది. గగన మార్గాన చేసే విన్యాసాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కథ కొత్తగా లేనప్పటికీ.. యాక్షన్ సినిమాలంటే ఇష్టపడే వారికి ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ నచ్చుతుందనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
న్యూస్ ఆర్బిట్ రేటింగ్: 2.75/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.