NewsOrbit
Entertainment News సినిమా

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి గురించి నమ్మలేని నిజం తెలుసుకున్న ఆమె తండ్రి !

Advertisements
Share

Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళంటూ ఇటీవల రూమర్స్ తెరపైకి వచ్చాయి. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ నీ ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఎప్పటినుంచో ఈ జంట గురించి ఈ వార్త వస్తూనే ఉంది. విషయంలోకి వెళ్తే డైరెక్టర్ అట్లీ కుమార్ నటి కీర్తి సురేష్ కి అత్యంత క్లోజ్ ఫ్రెండ్. దీంతో జవాన్ సినిమా ఇటీవల విజయం సాధించడంతో… ఈ సినిమా సక్సెస్ పార్టీలో కీర్తి సురేష్ కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. జవాన్ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించాడు. ఈ క్రమంలో పార్టీలో కీర్తి సురేష్ తో అనిరుద్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో రావటం జరిగాయి.

Advertisements

Her father found out the unbelievable truth about Keerthy Suresh's marriage

దీంతో వీరిద్దరికీ పెళ్లి ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్స్ పై కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ స్పందించారు. కీర్తి సురేష్ పెళ్లి గురించి వస్తున్నా వార్తలలో వాస్తవం లేదని ఖండించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మీకు మీరే డిసైడ్ అయితే ఎలా నాతో పని లేకుండా నా కూతురునీ అయినా అడిగి తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇప్పుడు మాత్రమే కాదు చాలా సార్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు ఖండిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంగ్ల పత్రికలు అనిరుద్ధ ప్రేమలో కీర్తి సురేష్ ఉన్నట్లు.. చాలా కథనాలు ప్రచురించడం జరిగింది. ఆ సమయంలో కీర్తి స్పందించి నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు మరియు పోస్టులు చూసి షాక్ అయ్యా.

Advertisements

Her father found out the unbelievable truth about Keerthy Suresh's marriage

ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలామందితో నాకు పెళ్లిళ్లు చేసేసారు. అయితే సమయం వచ్చినప్పుడు నా పెళ్లి గురించి అందరికీ చెబుతా అని కీర్తి సురేష్ అప్పట్లో క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కెరియర్ మంచి జోరు మీద ఉండటంతో రెండు మూడు సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఫుల్లుగా సినిమాలు చేసి తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామని తన తండ్రికి ఇటీవల కీర్తి సురేష్ చెప్పినట్లు టాక్. సర్కారు వారి పాట, దసరా ఇంకా పలు సినిమాలతో విజయాలు అందుకోవటంతో.. ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచించొద్దని కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లు సమాచారం.


Share
Advertisements

Related posts

మెగా హీరోతో త్రివిక్రమ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్..??

sekhar

Mahesh Babu: మరోసారి మనసున్న శ్రీమంతుడు అనిపించుకున్న మహేష్ బాబు..!!

sekhar

బిగ్ బాస్ 4 : ఈ వారం నామినేషన్లలో ఉన్న అయిదుగురు వీళ్ళే…! నామినేట్ అయినందుకు అతని దూకుడేంది సామి…?

arun kanna