Samantha: గత కొంతకాలంగా సమంత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసినదే. చేతో విడాకుల తరువాత నుండి ఆమె జనం నోళ్లల్లో నానుతూ వుంది. దాని తరువాత ఓ వర్గం వారు సమంతను చాలా రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. ఇక సమంత సినిమా కెరీర్ ముగిసిపోతుంది అంతా అనుకున్నారు. కానీ నవ్విన నాపై చేనే పండుతుంది అన్న మాదిరి సమంత ఇపుడు జెట్ స్పీడుతో దూసుకు పోతోంది. అవును.. వరుస సినిమాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
Pawan kalyan: ఇండస్ట్రీ హిట్ అని పవన్ ఫ్యాన్స్ బ్లైండ్‌గా ఫిక్సయ్యే సూపర్ న్యూస్ చెప్పిన హరీశ్ శంకర్
Samantha: సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే మరి..
అందరి అంచనాలను తలదన్నుతూ సామ్ ఇపుడు మంచి స్వింగ్ లో వుంది. దాదాపు ఓ పెద్ద హీరోకి ఉన్నంత బిజీ షెడ్యూల్ ఆమెకు వుంది. ఓ వైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలు, మరో వైపు పాన్ ఇండియా సినిమాలు, ఇంకో వైపు వెబ్ సిరీస్ లు అంటూ చాలా బిజీగా వుంటూ దూసుకుపోతుంది. గుణశేఖర్ సినిమా శాకుంతలం గురించి మనకు తెలిసిందే. ఇందులో సామ్ లీడ్ రోల్ లో మెరవనుంది. యశోధతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారబోతుంది.
Singer Sunitha: భర్తతో 5 నిమిషాల క్రితం ఇన్‌స్టాలో ఫొటో పెట్టిన సునీత..ఇద్దరు భలే ఉన్నారు!
సమంతకి లేటెస్ట్ శుభవార్త ఇదే..
ఇకపోతే రెండు వారాల క్రితం విడుదలైన సుకుమార్ పుష్ప సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇందులో సామ్ ఐటెం సాంగ్ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. పుష్ప సినిమా విజయంలో ఈ పాత కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవాలి. తాజాగా ఈ పాట ఫుల్ వెర్సన్ యూట్యూబ్ లో రిలీజ్ అవ్వగా, ప్రస్తుతం అది మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ న్యూస్ సమంతకి శుభవార్తనే చెప్పుకోవాలి.