సినిమా

Nani-Nazriya: ఎవ‌రి ఫోన్లు ఎత్త‌దు.. నజ్రియాపై నాని షాకింగ్ కామెంట్స్‌!

Share

Nani-Nazriya: న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం `అంటే.. సుంద‌రానికీ!`. బ్రోచేవారెవ‌రురా సినిమాతో గుర్తింపు ద‌క్కించుకున్న యంగ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ ద్వారా మ‌ల‌యాళ బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూన్ 10న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర టీమ్‌.. నేడు హైదరాబాద్‌లోని ఏఎంజీలో ఈవెంట్ నిర్వ‌హించి `అంటే.. సుంద‌రానికీ!` టీజ‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ టీజ‌ర్ అభిమానుల‌నే కాదు.. సినీ ప్రియుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

అయితే టీజ‌ర్ లాంఛ్ సంద‌ర్భంగా నాని హీరోయిన్ న‌జ్రియాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. `నజ్రియా నజీమ్‌ని తెలుగులోకి తీసుకురావడానికి ఎంతో మంది ప్రయత్నించారు. ఎవరు ఫోన్‌ చేసినా ఆమె ఎత్త‌దు. కానీ మా మూవీలో నటించడానికి ఓకే చెప్పింది. అందుకు ఆమెకు ధన్యవాదాలు` అంటూ నాని చెప్పుకొచ్చారు.

అలాగే `అంటే.. సుంద‌రానికీ!` గురించి మాట్లాడుతూ.. `ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. టీజర్‌లో చూపించిన దానికంటే రెండు రెట్లు ట్రైలర్‌, పది రెట్లు సినిమా ఉంటుంది` అని నాని అంచ‌నాల‌ను పెంచేశాడు. కాగా, ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌లో సుందర్‌ అనే బ్రాహ్మణుడిగా నాని నటిస్తుండగా, లీలా అనే క్రిస్టియన్‌గా న‌జ్రియా కనిపించబోతోంది.


Share

Related posts

మహేశ్ నెం.1.. పవన్ నెం.2.. ట్విట్టర్ ర్యాంకింగ్స్ లో రికార్డులు

Muraliak

ఎన్టీఆర్ కొత్త లుక్ చూశారా ? ఎంత బాగున్నాడో!

Teja

శివకుమార్‌ బి. తొలి చిత్రం ’22’

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar