టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2002వ సంవత్సరంలో డైరెక్టర్ తేజ దర్శకత్వంలో “జయం” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాతోనే నితిన్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన “సై” తో అందరి దృష్టిని ఆకర్షించాడు. స్టైలిష్ నటనతో పాటు అదిరిపోయే స్టెప్పులు.. వేస్తూ రొమాంటిక్ హీరోగా కనిపిస్తూ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే నితిన్.. తాజాగా సీరియల్స్ బాట పట్టడం జరిగిందట.
మేటర్ లోకి వెళ్తే తన కొత్త సినిమా “మాచర్ల నియోజకవర్గం” కోసం నితిన్ సీరియల్ లో కనిపించడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రమోషన్ కార్యక్రమాలు చాలా విన్నతునంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులు కూడా బుల్లితెర ఇంకా ఓటీటి లవైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో కొత్త సినిమా పెద్ద సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు.. బుల్లితెరపై చేస్తూ వస్తున్నారు. సాయంత్రం ఏడు అయింది అంటే చాలు చాలా వరకు.. జనాలు సీరియల్ బాట పడుతూ ఉండటంతో.. దీన్ని ప్రమోషన్ గా మార్చుకోవడానికి సినిమా హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి సీరియల్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇటీవల f3 మూవీ ప్రమోషన్ లలో భాగంగా అనిల్ రావిపూడి బుల్లితెరపై కనిపించి సందడి చేయడం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో యంగ్ హీరో నితిన్ కూడా సీరియల్స్ లో తన కొత్త సినిమా “మాచర్ల నియోజకవర్గం” ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఆగస్టు మొదటి వారంలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ఇటీవలే “రారా రెడ్డి” అనే సాంగ్ రిలీజ్ చేయగా యూట్యూబ్ లో భారీగా రెస్పాన్స్ సాధించడం జరిగింది. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో హీరో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ కనిపిస్తున్నారు. దీంతో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో బుల్లితెరలో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో నితిన్ ఉన్నారు.