చిట్టి రోబోట్.. 2.0 అని శంకర్ సినిమాను గత ఏడాది చూసే ఉంటాం. అయితే ఇప్పుడు రామ్ 2.0 ఏంటని అనుకుంటున్నారా? ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటి వరకు కనపడని మాస్ లుక్‌లోని రామ్‌ను పూరి తెరపై చూపించబోతున్నారు. పూరి స్టయిల్లో హీరోలా కనపడటానికి రామ్ జిమ్‌లో కండలు పెంచేస్తున్నాడు. ఈ విషయాన్ని రామ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. రామ్ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న ఫోటోలతో పాటు `రామ్ పోతినేని 2.0 లోడింగ్` అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు రామ్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
previous post
next post