NewsOrbit
Entertainment News సినిమా

Skanda Trailer: “స్కంద” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ పై హీరో రామ్ పొగడ్తలు..!!

Advertisements
Share

Skanda Trailer: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన “స్కంద” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీలా నటించింది. ఈ కార్యక్రమానికి నటసింహం నందమూరి బాలయ్య బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. బాలయ్య ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. “స్కంద” ట్రైలర్ లో రామ్ పోతినేని నీ చాలా పవర్ ఫుల్ గా చూపించారు. బోయపాటి మార్క్ హై వోల్టేజ్ మాస్ డైలాగులు ట్రైలర్ లో ఉన్నాయి.

Advertisements

hero ram praises balakrishna at skanda trailer release event

పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. సెప్టెంబర్ 15వ తారీకు తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిథి బాలకృష్ణపై హీరో రామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆహ్వానించడానికి వెళదామని ఫోన్ చేస్తే మనకు అటువంటి పట్టింపులు ఉండవని బాలకృష్ణ అన్నట్లు తెలిపారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో చాలామంది జై బాలయ్య జై బాలయ్య అని కేకలు వేశారని చెప్పుకొచ్చారు.

Advertisements

hero ram praises balakrishna at skanda trailer release event

ఒక్క తరాన్ని ఆకట్టుకోవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. అటువంటిది బాలకృష్ణ గారు దాదాపు మూడు తరాలను ఆకట్టుకుంటూ వారి అభిమానాన్ని సొంతం చేసుకోవడం నిజంగా అన్ని అవార్డుల కంటే ఇదే అత్యుత్తమైనా గౌరవం అని రామ్ స్పష్టం చేశారు. ప్రపంచంలో ప్రతి ఒక్క నటుడి డ్రీమ్ ఇదే అవ్వాలని.. రామ్ పోతినేని తెలియజేయడం జరిగింది. ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా కీలకపాత్ర పోషించారు. తమన్ సంగీతం అందించడం జరిగింది. తెలంగాణ యాసలో రామ్ పోతినేని డైలాగులు చెప్పడం జరిగింది. యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫస్ట్ టైం రామ్ పోతినేని పాన్ ఇండియా నేపథ్యంలో నటించిన “స్కంద” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share
Advertisements

Related posts

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో పోల్చటం సరికాదు అంటున్న అల్లు బాబీ..!!

sekhar

Waltair Veerayya: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న చిరంజీవి “వాల్తేరు వీరయ్య”..!!

sekhar

షూటింగ్ సమయంలో చెలరేగిపోతున్న సురేఖవాణి ఆమె కూతురు ..!!

sekhar