మాస్ మహారాజా రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. జయపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. కొత్తగా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 154వ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కావటం మాత్రమే కాదు రవితేజ జాయిన్ అయినట్లు స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది.
చిరంజీవి మూవీ షూటింగ్ లో రవితేజ జాయిన్ అయినట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్..!!
ప్రస్తుతం ఒక సాంగ్ తో పాటు ఒక యాక్షన్ సన్నివేశం రవితేజ పై చిత్రీకరిస్తున్నారు. మరోపక్క రవితేజ నటించిన “రామారావు ఆన్ డ్యూటీ” జూలై 29వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో పాటు రికార్డు స్థాయి లైకులతో “రామారావు ఆన్ డ్యూటీ” దూసుకుపోతుంది. ట్రెండింగ్ లో ఉంది. అయితే గతంలోనే ఈ సినిమా విడుదల అవ్వాలని కానీ నిర్మాత సుధాకర్ తో రవితేజకి గొడవలు అయినట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే.
అయితే ఈ వార్తలపై తాజాగా రవితేజ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ.. ఇలాంటి రూమర్స్ కొత్త కాదు, పనీపాటా లేని వ్యక్తులు కొందరు ఇలాంటి వార్తలు సృష్టిస్తారు. సుధాకర్ నాకు మంచి ఫ్రెండ్. అతనితో ఎవరికీ సమస్య రాదు.. అని రవితేజ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నేను సబ్ కలెక్టర్ గా కనిపిస్తాను. ఈ తరహా పాత్రను చేయడం..కెరియర్ మొత్తంలో ఇదే ఫస్టు టైమ్. నాకే ఈ క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది. ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేయడం జరిగింది..అని రవితేజ తెలిపారు. శరత్ మండవ దర్శకత్వంలో జరిగే “రామారావు ఆన్ డ్యూటీ” లో చాలా సంవత్సరాల తర్వాత హీరో వేణు కూడా కీలక పాత్ర చేయడం విశేషం.