ప్రేక్షకులని క్షమించమని అడిగిన శర్వా…

సాయి పల్లవి శర్వానంద్ జంటగా నటించిన చిత్రం, పడి పడి లేచే మనసు. ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సినిమా గురించి మాట్లాడిన శర్వా ఆశించినంత విజయాన్ని పొందలేక పోయామని, కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుంది అనుకున్నాను కానీ అందరిని మెప్పించలేక పోయింది. ప్రతి రివ్యూ చదివాను, అందరు రాసిన దాంట్లో నిజముంది. కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగోలేదు అన్నారు. అవన్నీ కన్సిడర్ చేసి నెక్స్ట్ సినిమా చేస్తాను, ఈ సినిమా విషయంలో మాత్రం ప్రేక్షకులు తనని క్షమించాలని కోరాడు.

నిజానికి పడి పడి లేచే సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి కానీ వాటిని అందుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు కానీ నటుడిగా శర్వా, తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. ఎంత కష్టపది చేసినా రిజల్ట్ మన చేతిలో ఉండదు కాబట్టి ఈసారి మంచి కథతో సినిమా చేసి ప్రేక్షకులని మెప్పిస్తాడేమో చూడాలి.