Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండ చాలా కాలం తర్వాత ఇటీవల ఖుషి సినిమాతో విజయం అందుకున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. అభిమానులను ఎంతగానో అలరించింది. ప్రేమ కథ నేపథ్యంలో సింపుల్ లైన్ స్టోరీ తో.. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నీ అలరించే రీతిలో సినిమా చేయడం జరిగింది. సినిమాలో హీరోయిన్ గా చేసిన సమంత కూడా చాలా కాలం తర్వాత హిట్ అందుకోవడం జరిగింది. ఈ సినిమా విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
తన కెరియర్ లో అభిమానులు కీలకమని చెప్పుకొచ్చారు. ఇక నుండి తన కెరియర్ లో అభిమానులను కూడా భాగస్వామ్యం చేస్తూ.. వచ్చే రెమ్యూనరేషన్ లో 100 కుటుంబాలకు.. సహాయం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రతి సినిమాకి గాను మొత్తం కోటి రూపాయలు అభిమానుల కుటుంబానికి ఖర్చు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. తన అభిమానులలో నిరుపేదలుగా ఉండే వారికి ఒక్కో కుటుంబానికి లక్ష ఇవ్వనున్నట్లు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా విజయ్ దేవరకొండ తన టీం సెలెక్ట్ చేసిన 100 మంది తన అభిమానుల నిరుపేద కుటుంబాలకు నేడు లక్ష రూపాయల చొప్పున పంపిణీ చేశారు.
ఖుషి ఈవెంట్ లో చేసిన ప్రకటనకు తన టీం వద్దకు వచ్చిన అభిమానులలో.. కటిక పేదరికం అనుభవిస్తున్న నిరుపేద కుటుంబాలకు సంబంధించి వచ్చిన అప్లికేషన్లు.. స్వీకరించి వారిలో వంద మందిని సెలెక్ట్ చేసి నేడు.. ప్రతి కుటుంబానికి లక్ష ఇచ్చి ఇచ్చిన మాటని.. విజయ్ దేవరకొండ నిలబెట్టుకోవడం జరిగింది. మీరు కూడా నా కుటుంబమే అని.. విజయ్ దేవరకొండ వారితో ముచ్చటించినట్లు సమాచారం. కొంతమంది స్థితిగతులు తెలుసుకొని.. మరింత సాయం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటివరకు భారతీయ చలనచిత్ర రంగంలో ఏ హీరో చేయని రీతిలో విజయ్ దేవరకొండ తన అభిమానుల విషయంలో ఏకంగా కోటి రూపాయలు.. సాయం చేయటం సంచలనంగా మారింది.