NewsOrbit
Entertainment News సినిమా

Vijay: టెన్త్, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు సాయం అందించడానికి హీరో విజయ్ కీలక నిర్ణయం..!!

Advertisements
Share

Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మాదిరిగా తమిళంలో విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో. అంతేకాదు పవన్ మరియు మహేష్ సినిమాలను తమిళంలో రీమేక్ చేసి అనేక విజయాలు మనోడు అందుకోవటం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో “వారసుడు” అనే సినిమాతో విజయ్ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. విజయ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Advertisements

Hero Vijay is a key decision to help students who have passed Tenth and Inter

ఇదిలా ఉంటే సినిమా పరంగా క్రేజ్ ఎంత ఉందో అదే రీతిలో సామాజికంగా కూడా విజయ్ అనేక సహాయక కార్యక్రమాలు చేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కదా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రాజకీయంగా కొద్దిగా యాక్టివ్ గా తెర వెనకాల ఉండి వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. పరోక్షంగా కొన్ని జాతీయ పార్టీలకు విజయ్ కౌంటర్ కూడా ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఇదిలా ఉంటే విజయ్ తన అభిమాన సంఘాల తరఫున తమిళనాడులో ఇటీవల పదవ తరగతి మరియు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు ఆర్థిక సాయం చేయటానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Advertisements

Hero Vijay is a key decision to help students who have passed Tenth and Inter

దీనిలో భాగంగా “విజయ్ మక్కల్ ఇ యక్కం” అనే తన అభిమాన సంఘం ద్వారా పాసైన ప్రతి విద్యార్థికి పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఫ్యాన్స్ అధ్యక్షులకు విద్యార్థుల సమాచారం సేకరించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా సమాచారం అందిన తర్వాత ఈ నెల 17వ తారీఖున డబ్బులు పంపిణీ చేయడానికి హీరో విజయ్ రెడీ అయ్యారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళ సినిమా రంగంలో సంచలనంగా మారింది.


Share
Advertisements

Related posts

`అమ్మ‌` చిత్రంలో క‌లైంజ్ఞ‌ర్‌గా ముర‌ళీశ‌ర్మ‌

Siva Prasad

Prabhas – Sujeeth: తన డైరెక్టర్‌కు దగ్గరుండి పవన్‌తో మాట్లాడి ఛాన్స్ వచ్చేలా చేసిన ప్రభాస్..?

GRK

Anasuya : ఐటమ్ సాంగ్స్ గురించి క్లారిటీ ఇచ్చిన అనసూయ… ఇకపై ఐటమ్ సాంగ్స్ కు దూరం..!

Teja