ప్రపంచ సినిమా రంగంలో తెలుగు సినిమా రంగానికి ప్రస్తుతం భారీగా ప్రాధాన్యత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన ఏకైక కారణం ఎస్ ఎస్ రాజమౌళి. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందిస్తారన సంగతి తెలిసిందే. దేశంలోనే భారీ బ్లాక్ బస్టర్ సినిమాలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “బాహుబలి”.. సిరీస్, “RRR” స్టోరీలు కూడా విజేందర్ ప్రసాద్ యే అందించడం జరిగింది. దేశంలో భారీ బ్లాక్ బస్టర్ అయినా చాలా సినిమాలకు విజయేంద్ర ప్రసాదే స్టోరీ అందించడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా హీరో విక్రమ్… ఆయనపై ప్రశంసలు వర్షం కురిపించారు. “కోబ్రా” మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తాను నెక్స్ట్ చేయబోయే సినిమాకి విజయేంద్రప్రసాద్ అదిరిపోయే స్టోరీ అందించారని విక్రమ్ చెప్పుకొచ్చారు. ఆయన అందించిన ఊర మాస్ స్టోరీ అంతర్జాతీయ స్థాయిలో.. అలరిస్తుందని తెలిపారు. అజయ్ జ్ఞానమూత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా “కోబ్రా” నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
చాలాకాలం తర్వాత విక్రమ్ నటించిన సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు “కోబ్రా” ఫలితం ఎలా ఉంటుందో అని చాలా ఉత్కంఠ భరితంగా ఉన్నారు. దాదాపు ఈ సినిమాలో పది రకాలుగా విక్రమ్ కనిపించనున్నట్లు సమాచారం. “అపరిచితుడు” తర్వాత ఆ తరహాలో ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని ఇటీవల హైదరాబాద్ కి వచ్చిన సమయం లో ఇంటర్వ్యూలో విక్రమ్ “కోబ్రా” గురించి తెలపటం జరిగింది. దీంతో ఈ సినిమాకి కెరియర్ లోనే అత్యంత హైయెస్ట్ రెమ్యూనరేషన్ విక్రమ్ తీసుకున్నట్లు ఫిలిం వర్గాలలో టాక్.