డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది వచ్చిన “పుష్ప” ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలుసు. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో సుకుమార్ సినిమా థియేటర్ హీరోగా బన్నీ నటించిన ఈ సినిమా.. రికార్డు స్థాయి వసూలు రాబట్టింది. మరి ముఖ్యంగా చాలామందిని ప్రభావితం చేసింది. సినిమాలో అల్లు అర్జున్ చెప్పే డైలాగులు మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇతర ఇండస్ట్రీకి చెందిన హీరోలు క్రీడా రంగానికి చెందిన స్టార్ ఆటగాళ్లు ఇంకా రాజకీయ నాయకులు.. పుష్ప డైలాగులు సోషల్ మీడియాలో చెప్పి బాగా వైరల్ అయ్యారు.
ఇటీవల బన్నీ అమెరికా పర్యటనలో అక్కడ అమెరికా దేశానికి చెందిన అధికారితో కూడా ఈ సినిమా డైలాగు చెప్పించడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా హీరో విక్రమ్ కూడా పుష్ప డైలాగ్ చెప్పడం జరిగింది. తన కొత్త సినిమా కోబ్రా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా “పుష్ప” లో హైలెట్ డైలాగ్..”పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా… ఫైర్” అనే డైలాగుని నవరసాలలో భాగంగా తొమ్మిది రకాలుగా విక్రం చెప్పారు. రకరకాలుగా విక్రమ్ తనదైన శైలిలో చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విక్రమ్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన కోబ్రా ఆగస్టు 31 వ తారీకు విడుదల కానుంది. తెలుగు వర్షన్ కి సంబంధించి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించటం జరిగింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.