సినిమా

Yash: ప్ర‌భాస్ హీరోయిన్‌పై మ‌న‌సు పారేసుకున్న య‌శ్‌.. ఆమె అంత ఇష్టమా?!

Share

Yash: క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆర్టీసీ బ‌స్ డ్రైవ‌ర్ కొడుకైన య‌శ్‌.. న‌ట‌నపై ఉన్న మ‌క్కువ‌తో సినీ ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశాడు. ఎన్ని అవ‌మానాలు ఎదురైనా, మ‌రెన్ని ఒడిదుడుకులు ఎదురొచ్చినా వాటిని త‌ట్టుకుని స్వ‌యంకృషితో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో స్టార్‌ హీరోగా గుర్తింపు పొందాడు.

ఇక 2018లో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`తో య‌శ్ పాన్ ఇండియా స్టార్‌గా అవ‌తారమెత్తాడు. తానెవ‌రో, త‌న టాలెంట్ ఏంటో దేశ ప్ర‌జ‌లంద‌రికీ రుచి చూపించాడు. కేజీఎఫ్ 1 విడుద‌లైన మ‌ళ్లీ నాలుగేళ్ల త‌ర్వాత కేజీఎఫ్ 2తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేశాడీయ‌న‌. ఏప్రిల్ 14న మొత్తం ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

ప్ర‌స్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ ఇటు సౌత్‌ను, ఇటు నార్త్‌ను ఓ ఊపు ఊపేస్తోంది. దీంతో స‌క్సెస్ జ్యోష్‌లో ఉన్న య‌శ్‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా షేర్ చేసుకున్నారు. అలాగే త‌న ఫేవరెట్‌ హీరోయిన్ ఎవ‌రో కూడా ఆయ‌న తెలియ‌జేశారు.

ఇంత‌కీ య‌శ్ ఫేవ‌రెట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె. ప్ర‌స్తుతం ఈమె ప్ర‌భాస్ తో క‌లిసి `ప్రాజెక్ట్‌-కె` చిత్రంలో న‌టిస్తోంది. అయితే ఈమెపైనే య‌శ్ మ‌న‌సు పారేసుకున్నారు. తన ఫేవరెట్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె అని, ఆమెతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటున్నానని య‌శ్ తాజా ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. అంతేకాకుండా దీపిక నటన ఎంతో బావుంటుందని, ఆమె సినిమాలను చూస్తూ ఉంటానని యశ్ తెలిపారు. య‌శ్ మాట‌ల‌తో ఆయ‌న‌కు దీపిక అంటే ఎంత ఇష్ట‌మో స్ప‌ష్టంగా అర్థ‌మైంది. మ‌రి ఆమెతో క‌లిసి న‌టించే అవ‌కాశం ఈయ‌న‌కు వ‌స్తుందో..లేదో..చూడాలి.


Share

Related posts

సుమ కాపురంలో చిచ్చు పెట్టిన బిగ్ బాస్ విన్నర్..! షో మధ్యలోనే రాజీవ్ కనకాల పై కోపం…

arun kanna

rashmi gautam: ఏంటి ఇంత అందంగా ఉంది , ఈ డ్రెస్ లో జబర్దస్త్ షో కి వెళితే అంకుల్స్ మతులు పోతాయి!

Teja

Aanchal Munjal New Wallpapers

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar