Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ ఉంటారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన యశ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో అతడికి క్రేజ్ ఉంది. ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో యశ్ కి అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. హీరో యశ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేజీఎఫ్ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఆ తర్వాత కేజీఎఫ్ కు సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్-2 కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కలెక్షన్ల పరంగా రికార్డులను కొల్లగొట్టింది. దీంతో యశ్ స్థాయి మరింత పెరిగింది. అభిమానుల్లో యశ్ కు ఉన్న క్రేజ్ కారణంగా తదుపరి సినిమాలను కూడా అదే స్ధాయిలో తెరకెక్కించాల్సి ఉంటుంది. యశ్ తో సినిమా అంటే కోట్ల రూపాయాల ఖర్చు అవుతుంది. అదే రేంజ్ లో కలెక్షన్లు కూడా వస్తాయి. దీంతో నిర్మాతల్లో కూడా యశ్ సినిమా అంటేనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దీంతో అభిమానుల్లో తనపై ఉన్న అంచనాల కారణంగా కేజీఎఫ్-2 తర్వాత నెక్ట్స్ సినిమాకు యశ్ ఇంకా డిసైట్ కాలేదు. ఇప్పటివరకు ఏ ప్రాజెక్టుకు కమిట్ కాలేదు. ఎలాంటి కథను ఎంచుకోవాలి.. పాన్ ఇండియా స్థాయిలో మేకర్స్ ఎవరు అనే వాటిపై యశ్ సమాలోచనలు చేస్తున్నాడు. తమిళ డైరెక్టర్ తో చేయాలా లేదా తెలుగు డైరెక్టర్లతో చేయాలా అనే దానిపై సంప్రదింపులు జరుపుతున్నారు. పాన్ ఇండియా సినిమా తీయగల దర్శకులు, మేకర్స్ కూడా వెతుకులాట మొదలుపెట్టాడు.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…