Chief Minister: ముఖ్యమంత్రి Chief Minister గా హీరోలు నటిస్తే ఆ కిక్కే వారు. అటువంటి సినిమాలు చాలా వచ్చాయి. కథలను బట్టి హీరోలు ఆయా పాత్రల్లో నటిస్తారు. వాటిలో రాజకీయ నేపథ్యమూ ఉంటాయి. సినిమాల్లో ముఖ్యమంత్రులుగా నటించిన హీరో, హీరోయిన్లను చూస్తే..
2021లో తలైవి సినిమాలో కంగనా రనౌత్ మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించింది. ఇదే సినిమాలో అరవింద్ స్వామి మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటిస్తున్నారు.
2019లో ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడులో మాజీ సీఎం ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించారు.
2019లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రపై తెరకెక్కిన ’యాత్ర’ సినిమాలో వైఎస్ పాత్రలో మళయాళ హీరో మమ్ముట్టి నటించారు. ‘ఛీఫ్ మినిష్టర్’ అనే మళయాళ సినిమాలో కూడా సీఎంగా నటించారు.
2019లో ’NGK’లో సూర్య సీఎంగా నటించారు.
2018లో ‘భరత్ అను నేను’ సినిమాలో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా నటించారు.
2018లో వచ్చిన ‘నోటా’ సినిమాలో విజయ్ దేవరకొండ సీఎంగా నటించారు.
2010లో వచ్చిన ‘లీడర్’ సినిమాలో రానా ముఖ్యమంత్రి పాత్రలో నటించారు.
2010లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ సినిమాలో శతృఘ్న సిన్హా సీఎం పాత్రలో నటించారు.
2010లో ‘భగీరథుడు’ సినిమాలో దివంగత సీఎం వైఎస్సార్ పాత్రలో వినోద్ కుమార్ సీఎంగా నటించారు.
2010లో ఉపేంద్ర: కన్నడలో ‘సూపర్’ సినిమాల సీఎంగా నటించారు.
2009లో వి.సముద్ర దర్శకత్వంలో వచ్చిన ‘అధినేత’లో జగపతిబాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించారు.
2006లో మలయాళ స్టార్ హీరో సురేష్ గోపీ ‘రాష్ట్రం’ అనే మలయాళ సినిమాలో సీఎంగా నటించారు.
1999లో ఒకేఒక్కడు సినిమాలో అర్జున్ ఒక్కరోజు సీఎంగా నటించారు. హిందీ రీమేక్ లో అనిల్ కపూర్ సీఎంగా నటించారు.
1997లో ’ఇద్దరు’ సినిమాలో మోహన్‌లాల్ మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటించారు.
1989లో ‘రాజకీయ చదరంగం’ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు సీఎంగా కనిపించారు.
1984లో వచ్చిన ‘ముఖ్యమంత్రి’ సినిమాలో కృష్ణ సీఎంగా నటించారు.
1983లో దాసరి నారాయణరావు తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఎమ్మెల్యే ఏడు కొండలు’ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు.
అయితే.. రియల్ లైఫ్ లో సీఎం అయిన ఎన్టీఆర్.. రీల్ లైఫ్ లో సీఎంగా నటించలేదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!