హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆమె గురించి అందరికీ తెలిసిందే. తన గ్లామర్, అంద చందాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంది. తన నటనతో మైమరిపించింది. బొద్దుగా కనిపించి మెహ్రీన్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. వరుస ఆఫర్లు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటోంది.
ఇక సోషల్ మీడియాలోనూ మెహ్రీన్ యాక్టిక్ గా ఉంటుంది. ఫొటోలను ప్రేక్షకులతో పంచుకుంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్ లతో పాటు ఫొటోషూట్ల ఫొటోలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. అయితే తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. ట్రెడిషనల్ లుక్ లో హాట్ పుట్టిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ట్రెడిషనల్ డ్రస్ లో దిగిన ఫొటోను షేర్ చేసింది. ఇందులో మల్లెతీగలాగా సన్నగా అందాలను ఆరబోసింది. ట్రెడిషనల్ డ్రస్ లో కుర్రాళ్ల మనస్సులను కొల్లగొడుతుంది.
లెహంగా, వోణీలో అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా ఈ ఫొటోలో కనిపించింది. చంద్రుడి వలే మెహ్రీన్ మొఖం మెరిసిపోతుంది. మెహ్రీన్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మోడ్రన్ డ్రెస్ లో కనిపించే ఈ బ్యూటీ ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ లో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మెహ్రీన్ ఫొటోలకు తెగ లైక్ లు కొడుతున్నారు.
కాగా, ఇటీవల మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో ప్రస్తుతం పూర్తిగా కెరీర్ మీదనే ఆమె ఫోకస్ పెట్టింది. ఇటీవల ఎఫ్ 3తో ఆమె హిట్ అందుకుంది. ప్రస్తుతం స్పార్క్ అనే సినిమాలో ఆమె నటిస్తుంది. అలాగే ఒక కన్నడ సినిమాలో కూడా ఆమె నటిస్తుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!