Categories: సినిమా

దానిపై కన్నేసిన రాశి ఖన్నా… పాపకి ఈసారైనా కలిసొస్తుందా?

Share

టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో మంచి హిట్ కొట్టిన అమ్మడు తరువాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత కాలంలో కూడా వరుసగా పలు సినిమాల్లో నటించి మంచి నటిగా పేరు సంపాదించుకుంది. అయితే స్టార్ హీరోయిన్ గా పెద్ద హీరోలతో నటించే అవకాశం మాత్రం దక్కించుకోలేక పోయింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా దశాబ్ద కాలం గడుస్తున్నా ఇంకా టాలీవుడ్ లో సరైన సక్సెస్ కోసం.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వుంది.

ప్రస్తుతం దానిమీదే గురి:

ఇటీవలే మన రాశి పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఫలితం తేడా కొట్టడంతో అమ్మడు డిఫెన్స్ లో పడింది. ఇకపోతే త్వరలో విడుదలకు సిద్ధం కాబోతున్న ‘థాంక్యూ’ పై మాత్రం అమ్మడు గట్టి నమ్మకం పెట్టుకుంది. ఎందుకంటే ఈ సినిమానుండి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో వుంది. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యూ సినిమాలో ఈ అమ్మడు నటించిన సంగతి విదితమే. థాంక్యూ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో థాంక్యూ సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే అయినా రాశి ఖన్నాకు ఇక తిరుగుండదు.

మరింత సమాచారం:

పక్కా కమర్షియల్ సినిమా తేడాకొట్టినా థాంక్యూ విషయంలో మాత్రం రాశి ఖన్నా పాజిటివ్ గా కనిపిస్తుంది. రాశి ఖన్నా ఈ సినిమా తో కూడా మళ్లీ నిరాశ పర్చితే మాత్రం టాలీవుడ్ లో ఆఫర్లకు ఒకింత కష్టతరం నెలకొంటుంది. ఇక రాశి ఖన్నా తెలుగు సినిమాలకు కాస్త దూరం అవుతున్నట్టు సమాచారం. ఎందుకంటే తమిళంలో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తమిళంలో బిజీగానే ఉన్న ఈమె టాలీవుడ్ ని లైట్ తీసుకున్నట్టు సమాచారం.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

42 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

51 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago