సినిమా

Anushka: మళ్లీ బిజీ అవుతున్న హీరోయిన్ అనుష్క..??

Share

Anushka: 2005లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన “సూపర్” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ కావడం తెలిసిందే. అప్పట్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలతో పాటు సౌత్ లో అనేక ఇండస్ట్రీలలో అవకాశాలు దక్కించుకోవడం జరిగింది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే స్వీటీ… “అరుంధతి” చిత్రంతో… తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి”తో తిరుగులేని క్రేజ్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే.Baahubali 2 actress Anushka Shetty's skincare and haircare secrets revealed! | India.com“బాహుబలి” ఇండస్ట్రీ హిట్ కావడంతో ఆ తర్వాత అనుష్క కి ఒరిస్సా పెట్టే అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ “సైజ్ జీరో” అనే సినిమా కోసం లావు పెరిగిన స్వీటీ… ఆ సినిమా ఫ్లాప్ కావడంతో.. కెరియర్ ని డేంజర్ జోన్ లోకి నెట్టేసినట్లు అయింది. అప్పటినుండి అనుష్కకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. “సైజ్ జీరో” తర్వాత అనుష్క నటించిన “నిశబ్దం” సినిమా కూడా అంతగా అలరించలేదు.Anushka Shetty's transformation from plump to 'patakha' will motivate you to hit the gym | People News – India TVదీంతో చాలా లాంగ్ గ్యాప్ రావటం తో పాటు అనుష్క కి అవకాశాలు పెద్దగా లేని సమయంలో నవీన్ పొలిశెట్టి హీరోగా.. యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న సినిమాలో అనుష్క హీరోయిన్ గా అవకాశం అందుకోవటం సంచలనంగా మారింది. ఈ సినిమాలో 40 సంవత్సరాల ఆంటీగా.. అనుష్క నటిస్తోంది. తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించే వ్యక్తిగా నవీన్ పోలిశెట్టి హీరోగా.. చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పక్కన పెడితే మరో రెండు ప్రాజెక్టులు అనుష్క తాజాగా ఒప్పుకున్నట్లు..ఫిలిం నగర్ టాక్. దీంతో కెరీర్ పరంగా మళ్లీ అనుష్క ఫాంలోకి వచ్చినట్లు.. ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రెండు ప్రాజెక్టులు వెబ్ సిరీస్ అన్నట్లు టాక్ నడుస్తోంది.


Share

Related posts

ట్రైలర్ లోనే థ్రిల్లర్ చూపించిన విశాల్ “చక్ర”…!

Srinivas Manem

Mahesh Trivikram: మహేష్ త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ హీరో..??

sekhar

మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాడి ప్ర‌యాణం

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar