16 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. 2007వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన “దేశముదురు” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీంతో ఇండస్ట్రీలో హన్సిక కి వరుస పెట్టి అవకాశాలు రావడం జరిగాయి. ముంబై కి చెందిన హన్సిక.. టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.
ప్రస్తుతం తన కెరియర్ లో 50వ సినిమా చేస్తుంది. ఈ సినిమాని డైరెక్టర్ యుఆర్ జమిల్ తెరకెక్కిస్తున్నారు. “మహా” అనే టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో సోమవారం చెన్నైలో హన్సిక.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఓ విలేకరి పెళ్లెప్పుడు చేసుకుంటారని హన్సిక నీ ప్రశ్నించారు. దానికి హన్సిక సమాధానం ఇస్తూ… పెళ్లి ఎందుకు చేసుకోవాలి.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పటికైతే వర్క్ తోనే నా పెళ్లి. ఇంక పెళ్లి టైం వస్తే అప్పుడు ఆలోచిస్తాను అంటూ హన్సిక.. కెరియర్ పైన దృష్టి ఉంది అన్నట్టు.. పరోక్షంగా సమాధానం ఇచ్చింది.
ప్రస్తుతం చేతిలో తెలుగు మరియు తమిళ భాషల్లో మొత్తం కలిపి పది ప్రాజెక్టులు ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో 30 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్న హన్సిక.. పెళ్లి పై చేసిన కామెంట్లు తెలుగు మరియు తమిళ సినిమా రంగాలలో చర్చనీయాంసంగా మారాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన గాని హన్సికకి తమిళంలో తిరుగులేని క్రేజ్ ఉంది. దీంతో చాలావరకు ఈ సొట్ట బుగ్గల సుందరి తమిళ సినిమాలకే ఎక్కువ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండటం విశేషం.