Isha Koppikar: హీరోయిన్ ఇషా కొప్పికర్ అందరికీ సుపరిచితులే. చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ వంటి తెలుగు సినిమాలు చేయడం జరిగింది. చేసినవి మూడు నాలుగు సినిమాలు అయినా గాని ఇషా కొప్పికర్ గ్లామర్ పరంగా చాలా మందిని ఆకట్టుకుంది. చంద్రలేఖ సినిమాలో రమ్యకృష్ణ చెల్లెలి పాత్రలో అదరగొట్టే యాక్టింగ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
90 దశకాల చివరిలో 2000 స్టార్టింగ్ లో… బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ పేరుగాంచిన టాప్ హీరో సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మొదట వచ్చిన తర్వాత రాకుండా పోయిందని స్పష్టం చేసింది. ఆ సినిమా తాను మిస్ అవ్వడానికి గల కారణం… సదరు బాలీవుడ్ టాప్ హీరోతో ఒంటరిగా రూమ్ కి వెళ్లాలని.. ఆయనే తీసుకెళ్తాడని… ఆఫర్ ఇచ్చారు కానీ దానిని నేను రిజక్ట్ చేయడంతో.. ఆ సినిమా ఛాన్స్ కోల్పోయాను. దీంతో నేను చేయాల్సిన ఆ పాత్రని మరొక టాప్ హీరో కూతురు చేయటం జరిగింది.
క్యాస్టింగ్ కౌచ్ అనుభవం తనకి ఎదురైందని ఇషా కొప్పికర్ అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలామంది ఒకప్పటి టాప్ హీరోయిన్ లు… రీ ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. రమ్యకృష్ణ, శోభన, మీనా, నదియా, స్నేహ, మీరా జాస్మిన్ ఇలాంటి వాళ్లు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో ఇషా కొప్పికర్.. కూడా మళ్లీ స్క్రీన్ పై కనబడటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 2009లో టిమ్మీ నారంగ్ ను ఇషా కొప్పికర్ వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది. 2019లో ఓ వెబ్ సిరీస్ లో ఇషా కొప్పికర్ నటించడం జరిగింది. ఇటువంటి తరుణంలో బాలీవుడ్ టాప్ హీరో తనని ఒంటరిగా రూమ్ లోకి రావాలని ఆమె ఏం చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.