Jenelia Deshmukh: హీరోయిన్ జెనీలియా అందరికీ సుపరిచితురాలే. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు అనేక భాషలలో ఈ ముద్దుగుమ్మ నటించడం జరిగింది. సౌత్ లో తెలుగు తమిళంలో మంచి క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా తెలుగులో ఇల్లు సినిమాలో సిద్ధార్థ సరసన హాసిని పాత్రలో జెనీలియా చాలామందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రెడీ, ఢీ సినిమాలు చేసి మంచి విజయాలు సాధించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన “ఆరంజ్” సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర చేయగా అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తెలుగులో చాలా మంది పెద్ద హీరోలతో జెనీలియా నటించింది. అయితే ఆ తర్వాత రితేష్ దేశ్ ముఖ్ నీ ప్రేమించి పెళ్ళాడి… సినిమాలకు దూరం కావడం తెలిసిందే. అయితే ఇటీవల మళ్లీ సెకండాఫ్ కెరియర్ కొనసాగిస్తూ రీ ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. “మిస్టర్ మమ్మీ” సినిమాలో నటించడం తెలిసిందే. ఇటీవల మరో కొత్త ప్రాజెక్టు అవకాశం వచ్చినట్లు నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో జెనీలియా అభిమానులతో పంచుకుంది. “ట్రయల్ పిరియడ్” అనే సినిమాలో నటిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ సినిమాని ఆలేయా సేన్ డైరెక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా జెనీలియా రావటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇప్పటికే తనకు తెలిసిన సౌత్ ఫిల్మ్ మేకర్స్ తో… సన్నిహితులతో మంచి కథ ఉంటే గ్యారెంటీగా రీఎంట్రీ ఇస్తానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం జెనీలియా బాలీవుడ్ లో పెళ్లయిన తర్వాత వరుసపెట్టి అవకాశాలు అందుకుంటోంది.