Kajal Aggarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2021లో పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ తర్వాత ఓ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. కరోనా ఎంట్రీ ఇవ్వక ముందు సినిమాలపరంగా వరుస అవకాశాలతో దూసుకుపోయింది. తెలుగు చలనచిత్ర రంగంలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ సొట్ట బుగ్గల సుందరి అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ అయింది. రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో దాదాపు తెలుగు మరియు తమిళంలో ఉన్న టాప్ హీరోలందరి సరసన అవకాశాలు అందుకుంది. అయితే కొన్నాళ్లకు దక్షిణాది సినిమా రంగానే విడిచిపెట్టి బాలీవుడ్ లో సెటిల్ అవుదామని అక్కడ ప్రయత్నాలు చేస్తే మొదట అవకాశాలు మెండుగా వచ్చినా గాని పరాజయాలు పలకరించడంతో కాజల్ అగర్వాల్ మళ్లీ దక్షిణాదిలోకి రియంట్రీ ఇచ్చింది.

ఈ క్రమంలో సినిమాలు చేస్తూ ఉన్న సమయంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో.. అనంతరం గ్యాప్ రావడంతో 2021లో పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన భర్త మరియు బిడ్డలకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేసి ఈ రాక్షసులకు కొనపాటం చెప్పాలి అని శిక్షించాలని కోరింది.

ఆ వీడియోలో కొంతమంది కుర్రోళ్ళు ఒక యువతిని కర్రలతో చితకబాదుతూ ఉన్నారు. దయ దక్షిణ్యం లేకుండా ఆడపిల్లని దాదాపు నలుగురు ముగ్గురు కర్రలతో కొడుతున్నారు. “WTF.. ఈ రాక్షసులకు తగిన గుణపాఠం చెప్పాలి. ఇలాంటి రాక్షసత్వానికి కారణమేమీ లేదు. మనం ప్రతిసారి మానవత్వాన్ని ఎలా మర్చి పోతున్నం..? చాలా బాధగా ఉంది అంటూ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసి ట్వీట్ చేసింది. ఇక ఇదే వీడియో పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించి శిక్షించాలని కోరడం జరిగింది.
Indians bringing shame to their country and civilization.
pic.twitter.com/QwGTNiF8KJ— Tarek Fatah (@TarekFatah) February 3, 2023