Prabhas: “బాహుబలి” సినిమాతో ప్రభాస్ రేంజ్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల అవ్వకముందు ప్రభాస్ మార్కెట్ కేవలం తెలుగులో మాత్రమే ఉండేది. బాహుబలి విజయంతో ప్రభాస్ కి ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ అయింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ట్యాగ్ కూడా ప్రభాస్ కి వచ్చింది. దీంతో ప్రభాస్ పక్కన నటించడానికి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలామంది హీరోయిన్స్ ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. తాజాగా బాలీవుడ్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్.. కంగనా రనౌత్ హీరో ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే కెరియర్ స్టార్టింగ్ లో కంగనా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే దక్షిణాదిలో ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా “ఏక్ నిరంజన్” అనే సినిమా చేయడం తెలిసిందే.
ఈ సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరు కూడా కెరియర్ పరంగా అప్పుడప్పుడే పైకి ఎదుగుతున్నారు. కానీ ఏక్ నిరంజన్ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ తర్వాత యధావిధిగా కంగనా బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోల సినిమాలకు దీటుగా కలెక్షన్లు రాబడుతూ… దర్శక నిర్మాతగా కూడా రాణిస్తుంది. సింగిల్ గానే వందల కోట్లు వసూలు సాధించే స్థాయికి ఎదిగింది. రీసెంట్గా తమిళ దర్శకుడు పీ వాసు దర్శకత్వంలో “చంద్రముఖి 2” సినిమా చేయటం తెలిసిందే. లారెన్స్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో.. కంగనా నటిస్తోంది.
మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న తరుణంలో తాజాగా హైదరాబాదులో ప్రమోషన్ కార్యక్రమంలో కంగనా పాల్గొని.. హీరో ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మళ్లీ ప్రభాస్ తో “ఏక్ నిరంజన్ 2” సినిమా చేస్తారా అని ప్రశ్నించగా కచ్చితంగా చేస్తాను అని మాట ఇచ్చింది. అంతేకాదు హీరో ప్రభాస్ చాలా తారాస్థాయికి చేరుకున్నాడు. ప్రభాస్ అసలైన మగాడు , మొనగాడు -ఇండియా లోనే టాప్ అంటూ అతని ఎదుగుదల చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని.. ప్రభాస్ సక్సెస్ పై లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్ అనడం తో మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా ఆ పొగడ్తలకు ఉలిక్కిపడ్డరు. సాధారణంగా కంగనా హీరోలను పెద్దగా పట్టించుకోదు. అలాంటిది ప్రభాస్ నీ పొగడటం అందరికి షాక్ ఇచ్చినట్లు అయింది.