హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తేజ దర్శకత్వంలో “జయం” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవటం జరిగింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సై సినిమాతో కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్.. ప్రేమ కథ ఇంకా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కలిగిన సినిమాలు చేస్తూ విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తున్నారు. మధ్యలో వరుసలాపులు అందుకున్న గాని “ఇష్క్” సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది.
ప్రస్తుతం “మాచర్ల నియోజకవర్గం” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ కలిగిన సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో ఐఏఎస్ పాత్రలో నితిన్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా “ఉప్పెన” ఫేమ్ బ్యూటీ… కృతి శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో నితిన్ పై పొగడ్తల వర్షం కురిపించింది. నితిన్ చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం ఉంది. “మాచర్ల నియోజకవర్గం” లో స్వాతి అనే పాత్ర చేస్తున్నాను. కెరియర్ లో ఫస్ట్ సిట్టింగ్ లోనే విన్న మొదటిసారి ఓకే చేసిన స్క్రిప్ట్ ఇదే అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ “ఉప్పెన” తర్వాత చాలావరకు అటువంటి పాత్రలే చేయటానికి అవకాశాలు వచ్చాయని.. కానీ అన్ని ఆచితూచి ఒప్పుకోవడం జరిగింది అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమా ట్రైలర్ మరియు టీజర్ చూసి చాలామంది మాస్ ఆడియన్స్ కోసమే తీశారని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ సినిమా స్టోరీ పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ నీ టార్గెట్ చేసి తీసిందని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. రొటీన్ పాత్రలకు భిన్నంగా తాను ఈ సినిమాలో నటించినట్లు చెప్పుకొచ్చింది. నితిన్ తో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తాయని పేర్కొంది. సినిమాలో భారీతారాగణం ఉండటం కారణంగా ఎక్కడా కూడా బోర్ అనిపించదని చెప్పుకొచ్చింది. మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12వ తారీకు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.