Adipurush: ప్రభాస్ రాముడిగా నటిస్తున్న “ఆదిపురుష్” సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా కృతి సనన్ కొత్త అప్ డేట్ ఇవ్వటం జరిగింది. విషయంలోకి వెళ్తే అక్టోబర్ 12 వ తారీకు నుండి.. “ఆదిపురుష్” లో తన పాత్రకి సంబంధించి డబ్బింగ్ స్టార్ట్ చేసినట్లు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
“ఆదిపురుష్” సినిమాకి సంబంధించి టీజర్ ఇటీవలే అక్టోబర్ మూడవ తారీకు విడుదల చేయటం తెలిసిందే. టీజర్ అభిమానులను ఎంతో నిరాశపరిచింది. గ్రాఫిక్స్ మరి దారుణంగా ఉండటంతో సినిమా యూనిట్ పై బండ బూతులు తిడుతున్నారు. చిన్న పిల్లల వీడియో గేమ్ తరహాలో “ఆదిపురుష్” టీజర్ లో బొమ్మలు ఉన్నాయని మండిపడుతున్నారు. అయితే సెల్ ఫోన్ ఇంకా యూట్యూబ్ లో దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేయలేదని సినిమా యూనిట్ తెలిపింది. అంతేకాదు కచ్చితంగా దియేటర్ లో మాత్రం.. త్రీడీలో చూశాక వేరే అనుభూతి కలుగుతుందని “ఆదిపురుష్” వచ్చిన విమర్శలపై దర్శకుడు మరియు నిర్మాత సమాధానం ఇవ్వడం జరిగింది.
ఇదిలా ఉంటే జనవరి 12వ తారీకు నాడు ప్రపంచ స్థాయిలో భారీ ఎత్తున అనుకున్న సమయానికి విడుదల చేయాలని.. భావించిన సినిమా యూనిట్.. ఆ రీతిగానే పనులు చక చకా చేస్తూ ఉంది. దీనిలో భాగంగా ముందుగా చేత పాత్రకి సంబంధించి డబ్బింగ్ కృతి సనన్ చెప్పేస్తోంది. అక్టోబర్ 23వ తారీకు ప్రభాస్ బర్త్ డే నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రభాస్ కి సంబంధించి మరో స్పెషల్ వీడియో రిలీజ్ చేయడానికి రెడీ అవ్వుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!