Namitha: ప్రముఖ హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2002లో వచ్చిన `సొంతం` సినిమాతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అందాల భామ.. ఆ తర్వాత జెమిని, ఒక రాజు-ఒక రాణి , ఐతే ఏంటి, నాయకుడు, బిల్లా, సింహా ఇలా పలు సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరైంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించిన నమిత.. ఒకానొక సమయంలో చాలా బొద్దుగా మారిపోయింది. దాంతో ఆమె కెరీర్ క్లోజ్ అని అంతా అనుకున్నారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా తమిళంలో వరుస అవకాశాలు అందుకుని సత్తా చాటింది. ఐటెం సాంగ్స్‌లోనూ మెరిసిన నమతి.. త్వరలోనే తల్లి కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. తాను గర్భవతినని తెలిపింది. ఈ రోజు తన బర్త్‌డే సందర్భంగా ఈ శుభవార్తను అందరితోనూ పంచుకుంది. `మాతృత్వం.. ఇది నా జీవితంతో కొత్త అధ్యాయం. నాలో ఏదో మార్పు మొదలైంది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
చిన్నారి కిక్స్ కొత్త ఫీలింగ్స్‌ను ఇస్తున్నాయి. ఆ ఫీలింగ్స్ ఇంతకు ముందెన్నడూ లేవు` అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చిన నమిత బేబీ బంప్‌తో దిగిన ఫొటోలను సైతం షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, 2017లో నటుడు వీరేంద్ర చౌదరిని నమిత ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి తిరుపతిలోనే జరిగింది. ఇక 41 ఏళ్ల వయసులో నమిత తల్లి కావడం విశేషం.