Nandita swetha : ఇండస్ట్రీలో ముందుగా తమిళ కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి నందితా శ్వేత తెలుగులో”ఎక్కడికి పోతావు చిన్నవాడా” అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తర్వాత “ప్రేమ కథ చిత్రం2” సినిమాలో నటించారు. అయితే ఈమె తెలుగులో నటించిన రెండు సినిమాలు హర్రర్ ఫిలిమ్స్ కావడంతో ప్రేక్షకులను భయపడుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే లాక్ డౌన్ అనంతరం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నందిత శ్వేత నటించిన “అక్షర” అనే సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ నందిత శ్వేత ఈ సినిమా గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
అక్షర సినిమా ద్వారా ఈ సమాజానికి ఒక సందేశం ఇవ్వబోతున్నామని, ఈ సినిమాలో హీరోయిన్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా నందిత తెలియజేశారు. ఈ సినిమాలో తను ఒక లెక్చరర్ పాత్రలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నట్లు నందిత తెలిపారు. ప్రస్తుత సమాజంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న దోపిడీలు, ఫీజులు అధికంగా పెంచడం, దీని ద్వారా విద్యార్థులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గురించి ఈ సినిమాను తెరకెక్కించినట్లు నందిత తెలియజేశారు.
అక్షర లో నటించడానికి మొదట భయపడ్డా:
ఇండస్ట్రీలోకి వచ్చి కేవలం కొంత సమయంలోనే “అక్షర” లాంటి లేడి ఓరియెంటెడ్ సినిమా తీయాలంటే ముందుగా భయపడ్డాను. అయితే ఈ సినిమా చేయడం వల్ల ఈ సమాజానికి ఒక సందేశం తెలియజేసినట్లు అవుతుందనే ఉద్దేశంతో ఈ సినిమాను ఎంతో ధైర్యంగా చేయడానికి ఒప్పుకున్నట్లు ఈమె తెలియజేశారు. ఒకవైపు సందేశాత్మక చిత్రమే కాకుండా మరో వైపు కామెడీ కూడా ప్రజలను ఆకట్టుకుంటుందని నందితా శ్వేత తెలియజేశారు.తాను సినిమాల ఎంపిక విషయంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా డైరెక్టర్లు తనను నమ్మి కథ ఇస్తే ఎంతో సంతృప్తిగా ఆ పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. అయితే ప్రస్తుతం ఓటిటి, వెబ్ సిరీస్ లలో నటించడానికి తన సిద్ధంగా లేదని ఈ సందర్భంగా నందిత శ్వేత తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఈమె తమిళ, కన్నడ భాషలతో పాటు మొత్తం నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!