కన్నడ ఇండస్ట్రీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. వరుస పెట్టి అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో “చలో” సినిమాతో ఎంట్రీ ఇచ్చి తర్వాత “గీతాగోవిందం” తో అదిరిపోయే హిట్టు అందుకని.. స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు సినిమాలో నటించిన రష్మిక మందన ఆ తర్వాత అల్లు అర్జున్ “పుష్ప” తో మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడం జరిగింది. “పుష్ప” పాన్ ఇండియా నేపథ్యంలో తిరుగులేని విజయం సాధించడం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయ్యాయి.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రష్మిక మందన ఒకపక్క బాలీవుడ్ మరోపక్క దక్షిణాది సినిమా రంగంలో వరుస అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పటికీ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సరసన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న “వారసుడు” లో హీరోయిన్ అవకాశం అందుకుంది. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో రష్మిక మందన అవకాశం అందుకోవటం జరిగిందంట. పూర్తి విషయంలోకి వెళితే..తమిళ స్టార్ హీరో విక్రమ్… పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా అవకాశం అందుకోవడం జరిగింది.
జ్ఞానవేల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల స్టార్ట్ అయ్యాయి. తమిళంలో విజయ్ మరియు ఇప్పుడు విక్రమ్ లాంటి పెద్ద హీరోలతో కలిసి నటించే అవకాశం రావడంతో రష్మిక ఫుల్ హ్యాపీగా ఉందంట. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో టైగర్ శ్రాఫ్ హీరోగా శశాంక్ కేతన్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మిస్తున్న సినిమాలో రష్మిక ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే రష్మిక రెండు సినిమాలలో నటించడం జరిగింది. ఆ రెండు కూడా త్వరలో విడుదల అవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రీతిగా పుష్ప విజయంతో ఒక పక్క బాలీవుడ్ మరోపక్క సౌత్ లో టాప్ హీరోల సరసన రష్మిక మందన అవకాశాలు అందుకోవటం సంచలనంగా మారింది.