29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Samantha: షూటింగ్ లో గాయాలు పాలైన హీరోయిన్ సమంత..!!

Share

Samantha: గత ఏడాది అక్టోబర్ నెల నుండి ఈ ఏడాది జనవరి నెల వరకు దాదాపు హీరోయిన్ సమంత మంచానికి పరిమితం కావడం తెలిసిందే. “మయోసైటీస్” అనే అరుదైన వ్యాధితో పోరాడుతూ ఇప్పుడిప్పుడే మళ్ళీ బయట ప్రపంచంలోకి అడుగు పెడుతూ ఉంది. ఈ వ్యాధి రాకముందు సమంత కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న తరహాలో విజయ పరపరంతో… దూసుకుపోతూ ఉంది. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చిన సమంత “పుష్ప” సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా.. మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇంకా హిందీలో “ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ లో ఆమె చేసిన నటన మరిన్ని అవకాశాలు తీసుకురావడం జరిగింది.

Heroine Samantha injured in shooting

కెరియర్ ఈ రీతిగా మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో.. మయో సైటీస్ వ్యాధి రావడంతో.. సామ్ మంచానికి పరిమితమైంది. ఈ క్రమంలో దాదాపు మూడు నెలలపాటు చికిత్స తీసుకున్న సమంత ఇటీవల మళ్ళీ… కోలుకొని మెల్లమెల్లగా షూటింగు స్టార్ట్ చేస్తూ ఉంది. దీనిలో భాగంగా బాలీవుడ్ లో హీరో వరుణ్ ధావన్ తో చేయబోయే వెబ్ సిరీస్ కోసం యాక్షన్స్ సన్నివేశాలకు సంబంధించి శిక్షణ పొందుతున్న సమంత గాయాల పాలయ్యింది. సెట్స్ లో ఆమె చేతికి గాయాలు అయ్యాయి.

Heroine Samantha injured in shooting

స్వయంగా సమంత తనకి గాయమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె చేతులకు గాయాలు రక్తపు మరకలు.. చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో సమంత డెడికేషన్ పై ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మొన్ననే జీవితంపై పోరాడి హాస్పిటల్లో ఉండి.. ఇప్పుడిప్పుడే ఆరోగ్యంగా ఉంటున్న క్రమంలో… సినిమా కోసం నువ్వు ఎంతగా మళ్లీ రిస్క్ చేస్తున్నావంటే.. నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.


Share

Related posts

Bheemla Nayak: అప్పుడు ఆర్ఆర్ఆర్… ఇప్పుడు భీమ్లా..! ఎంతైనా పెద్ద సినిమాలు పెద్ద సినిమాలే

arun kanna

Rajendra Prasad: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ గురించి తన బయోగ్రఫీలో రాసుకున్న మాజీ ప్రధాని..!!

sekhar

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ బ్రేకింగ్ న్యూస్.. ప్రశాంత్ నీల్ మామూలోడు కాదు బాబోయ్!

Ram