Samantha: గత ఏడాది అక్టోబర్ నెలలో హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే ప్రమాదకర వ్యాధి బారిన పడటం తెలిసిందే. ఈ పరిణామంతో చేస్తున్న సినిమా షూటింగ్స్ మొత్తం సమంత ఆపేసింది. దాదాపు మూడు నెలలకు పైగానే ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సమయంలో “యశోద” సినిమా రిలీజ్ కావలసి ఉంది. ఆ టైంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా సమంత పెద్దగా పాల్గొన్నది లేదు. ఒకటి రెండు ఇంటర్వ్యూలకి మాత్రమే హాజరయ్యింది. కానీ సినిమా విజయం సాధించింది. మయాసైటిస్ చాలా ప్రాణాంతకర వ్యాధి కావటంతో పాటు నడవలేని పరిస్థితిలో సమంత ఉండటంతో… దాదాపు గదా 6 నెలలకు పైగానే అనేక ఇబ్బందికర పరిస్థితులు.
ఫిబ్రవరి నెలలో కాస్త ఆరోగ్యం కుదుటపడటంతో ఆగిపోయిన షూటింగ్స్ మళ్లీ సమంత స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ముందుగా “శాకుంతలం” కంప్లీట్ చేయడం జరిగింది. ఈనెల 14వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దేవ్ మోహన్, మోహన్ బాబు మరి కొంతమంది కీలకపాత్రలు పోషించడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. దీంతో అన్ని భాషల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత ఫుల్ బిజీగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో తాను అనారోగ్యానికి గురైనట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. “గత వారం రోజులుగా మీ మధ్య ఉంటూ నా సినిమా ప్రమోట్ చేస్తూ… మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు ఆనందంగా ఉంది.
బిజీ షెడ్యూల్, ప్రమోషన్ ల కారణంగా ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నాను. ఈ క్రమంలో నా గొంతును కూడా కోల్పోయాను” అని సమంత పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పై అభిమానులు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని… భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు. మహాభారతంలో చిన్న కాన్సెప్ట్ నీ ఆధారం చేసుకుని తెరకెక్కించిన సినిమా “శాకుంతలం”. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ సినిమాని దిల్ రాజు తో పాటు గుణశేఖర్ కూతురు కూడా నిర్మాణ భాగస్వామ్యంలో పాలుపంచుకుని నిర్మించడం జరిగింది.