హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎంతోమంది హీరోల సరసన నటించిన టబు ఇప్పటికే ఇంకా పెళ్లి చేసుకోలేదు. దాదాపు వయసు 40 సంవత్సరాలకు పైనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా టబు హాస్పిటల్ లో జాయిన్ అయింది. విషయంలోకి వెళ్తే అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న “భోలా”లో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే ఈ క్రమంలో సినిమాలో ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో టబు కంటికి గాయం కావడం జరిగింది అంట. యాక్షన్స్ సన్నివేశంలో బైక్ పై దుండగులు వెంబడించే చేజింగ్ సీన్ చేస్తున్న సమయంలో..ట్రాక్ అద్దాలు పగిలి టబు కంటికి.. నుదిటిపై.. కనుబొమ్మలకు గాయమై తీవ్రంగా రక్తస్రావం అయినట్లుగా సమాచారం. దీంతో వెంటనే ఆమెను హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు.
దీంతో టబు కోలుకున్న తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారంట. మరోపక్క ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందుగానే విడుదల తేదీ ప్రకటించేశారు. అయితే తాజా పరిణామంతో టబు కంటి నుదిటిపై బలంగా గాయం కావడంతో… షూటింగ్ దాదాపు నెల రోజులు ఆగిపోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చేజింగ్ సీన్ దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతాలలో తీయడంతో ట్రక్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో టాబుకి.. కొన్ని ఆకులు అడ్డు రావడంతో ఒక్కసారిగా బ్రేక్ పడటంతో ఈ ఘటన జరిగినట్లు టాక్. ఈ నేపథ్యంలో అభిమానులు త్వరగా టాబు కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నారు.