Tammanna: మిల్కీ బ్యూటీ హీరోయిన్ తమన్నా అందరికీ సుపరిచితురాలే. 2005వ సంవత్సరంలో మంచు మనోజ్ హీరోగా నటించిన “శ్రీ” సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా తమన్నా … అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకోవటం జరిగింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా తమన్నా సినిమాలు చేయడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంకా చాలా మంది హీరోలతో తమన్నా నటించింది. తెలుగులో “హ్యాపీ డేస్” సినిమాతో మొట్టమొదటి హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అనంతరం వరుస అవకాశాలు అందుకున్న తమన్నా.. సౌత్ ఇండస్ట్రీ లోనే బిజీ హీరోయిన్ గా.. సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం గతంలో కంటే కొద్దిగా స్పీడ్ తగ్గిన తమన్నా తాజాగా.. సౌత్ ఇండస్ట్రీ అదేవిధంగా నార్త్ ఇండస్ట్రీకి చెందిన సినిమా ఆడియన్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నార్త్ మరియు సౌత్ అభిమానులను పోల్చి చూస్తే చాలా తేడా ఉంటుందని తమన్నా చెప్పుకొచ్చింది. ఒక్కసారి దక్షిణాది ప్రేక్షకులకు నచ్చితే… అభిమానించే ఆర్టిస్టులతో ఎంతో కనెక్ట్ ఐపోతారు. సౌత్ ఇండియా సినీ లవర్స్ కి ఎమోషన్స్ చాలా ఎక్కువ అని తమన్నా స్పష్టం చేయడం జరిగింది.
బాలీవుడ్ లో అనేక అవకాశాలు వచ్చినప్పటికీ.. దక్షిణాదిలో లభించే అభిమానం.. నార్త్ లో చూడ లేదని స్పష్టం చేయడం జరిగింది. దక్షిణాది అభిమానులతో విడదీయరాని బంధం అంటూ దక్షిణాది అభిమానులపై తమన్నా పొగడ్తల వర్షం కురిపించింది. ఇటీవలే “ఎఫ్ త్రీ”లో అదిరిపోయే క్యారెక్టర్ చేసి నవ్వులు పూయించిన తమన్నా త్వరలో.. చిరంజీవి హీరోగా నటిస్తున్న “బోలా శంకర్” సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. ఇంకా రెండు మూడు హిందీ సినిమాల్లో కూడా తమన్నా చేస్తూ ఉంది. కెరీర్ పరంగా బాలీవుడ్ మొదలుకుని సౌత్ వరకు అనేక అవకాశాలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా మిల్కీబ్యూటీ దూసుకుపోతుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!