సినిమా

Tollywood: సీనియర్ ట్యాగ్ పడినా గాని సత్తా చాటుతున్న హీరోయిన్ లు..!!

Share

Tollywood: సినిమా రంగంలో సీనియర్ హీరో అనే ట్యాగ్ పడినా గాని పెద్దగా కెరియర్ కి నష్టమేమీ ఉండదు. కానీ హీరోయిన్ లు విషయానికొస్తే ఒక్కసారి సీనియర్ హీరోయిన్ అనే ట్యాగ్.. పడింది అంటే.. కెరీర్ క్లైమాక్స్ కి చేరుకున్నటే. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ అనే ట్యాగ్ పడినా గాని.. కెరీర్ పరంగా మరింత దూసుకుపోతున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, అనుష్క, తమన్నా వీళ్లంతా ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ లు. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవారు.

heroines in Tollywood who are capable even if they get a senior tag
heroines in Tollywood who are capable even if they get a senior tag

కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లు గా మారిపోయారు. కొత్త ముద్దుగుమ్మలు.. రష్మిక మందన, పూజా హెగ్డే మరికొంతమంది రావటంతో.. అవకాశాలు తగ్గిపోయాయి. అయినా కానీ చాలా వరకూ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ లుగా ముద్ర పడిన ముద్దుగుమ్మలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల ను సెలెక్ట్ చేసుకుంటూ మరో పక్క వెబ్ సిరీస్ ప్రాజెక్టులను ఓకే చేస్తూ.. కెరియర్ పరంగా డౌన్ ఫాల్ రాకుండా చూసుకుంటున్నారు.

heroines in Tollywood who are capable even if they get a senior tag
heroines in Tollywood who are capable even if they get a senior tag

సీనియర్ హీరోల సినిమాలలో హీరోయిన్ అవకాశాలు అందుకుంటూ కొన్ని కమర్షియల్ సినిమాలలో ఐటెం సాంగ్ లు చేస్తూ ఈ సీనియర్ హీరోయిన్స్.. మాలో ఇంకా సత్తా ఉందని చాటుతున్నారు. కుర్ర హీరోయిన్లు కీలక ప్రాజెక్టుల అవకాశాలు కొట్టుకుపోతున్న గాని… డిఫరెంట్ స్ట్రాటజీ లు ప్లే చేస్తూ .. ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లు గా ముద్రపడిన వాళ్ళు.. కెరీర్ పరంగా కొత్తగా రాణిస్తున్నారు. కాజల్ అగర్వాల్ చిరంజీవి “ఆచార్య” లో, అనుష్క..నవీన్ పోలిశెట్టి సినిమాలో.., తమన్నా ఎఫ్ 3.. అదేవిధంగా చిరంజీవి సినిమాలో అవకాశాలు అందుకోవడం జరిగింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో రాణిస్తోంది. సమంత ఒకపక్క వెబ్ సిరీస్.. మరో పక్క ఐటెం సాంగ్స్.. చేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది.


Share

Related posts

Pushpa: “పుష్ప” సక్సెస్ మీట్ లో కన్నీరు పెట్టుకున్న సుకుమార్, బన్నీ..!!

sekhar

ఈ ఏడాది మెగా అభిమానులకు పండగే..!!

sekhar

Shriya Saran Recent Images

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar