సినిమా

Hey Sinamika Trailer: అదిరిపోయిన `హే సినామిక` ట్రైల‌ర్‌.. చూసి తీరాల్సిందే!

Share

Hey Sinamika Trailer: మలయాళ స్టార్​ దుల్కర్​ సల్మాన్ హీరోగా బృందా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `హే సినామిక‌`. కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరి ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. రొమాంటిక్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 3న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజాగా విడుద‌ల చేశారు. `నా పేరు ఆర్యన్ మీరు వింటున్నది ఎస్ ఎఫ్ ఎమ్ లో 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు..` అంటూ దుల్కర్ సల్మాన్ వాయిస్ తో ప్రారంభ‌మైన ఆ ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. `ఆర్జే గా పనిచేసే ఆర్యన్(దుల్క‌ర్‌) కి మౌన(అదితి) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మరి పెళ్ళికి దారి తీస్తుంది.

పెళ్లి తరువాత ఏ గొడ‌వైనా ఆర్యన్ సర్దుకుపోతుంటాడు. అది న‌చ్చ‌ని మౌన.. విడాకులు తీసుకోవాలనుకుంటుంది. అందుకోసం తనతో కలిసి పని చేసే ఫ్రెండ్స్‌ను సాయం కోర‌గా.. వారి ఏవేవో ప్లాన్స్ వేస్తుంటారు. అదే సమయంలో ఆర్యన్ మరో అమ్మయి(కాజ‌ల్‌)తో స్నేహం చేస్తాడు. భర్త మరొకరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేని మౌన తిరిగి అతడికి పొందాలనుకుంటుంది. కానీ, అప్ప‌టికే లవ్, ఫ్రెండ్షిప్‌పై న‌మ్మ‌కం పోతుంది.

ఆ త‌ర్వాత ఏం అయింది..? కాజ‌ల్‌, ఆర్య‌న్‌ల మ‌ధ్య ఏం జ‌రిగింది..? అస‌లు ఆర్యన్, మౌన కలిసారా..? అన్న‌దే సినిమా అని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. సినిమా ఎలా ఉండ‌బోతోందో ట్రైల‌ర్‌లోనే అద్భుతంగా చూపించారు. విజువ‌ల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటి అంశాలు బాగున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి లేటెందుకు మీరూ `హే సినామిక` ట్రైల‌ర్‌పై ఓ లుక్కేసేయండి.


Share

Related posts

కొత్త కామెడీ షో లో బూతుల పర్వం..! నాగబాబు పక్కనే నిహారిక, శ్రీ ముఖి

arun kanna

Salman Khan: సల్మాన్ ఖాన్ గ్రాఫ్ తగ్గుతోందా..! ‘రాధే’ ఫలితమే నిదర్శనమా..!?

Muraliak

NTR: ఎన్టీఆర్ తో మూడో అతి పెద్ద భారీ ప్రాజెక్టు చేపట్టబోతున్న ఆ  నిర్మాణ సంస్థ..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar